హరికృష్ణ మరణవార్త తెలిసి కూడా మోక్షజ్ఞ ఎందుకు రాలేదు కారణం తెలిస్తే షాక్ అవుతారు

నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సహచరులకు సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి గా చెప్పుకునే నందమూరి హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇటు రాజకీయ రంగం, అటు సినీ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. పార్టీలకు అతీతంగా ఎందరో రాజకీయ ప్రముఖులు, అగ్రశ్రేణి నటులు, ముఖ్యంగా విబేధాలను పక్కనపెట్టి నందమూరి కుటుంబం మొత్తం హరికృష్ణ భౌతిక కాయం సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

చివరకు యువరత్న బాలకృష్ణ కూడా విచ్చేసారు. హరికృష్ణ కుమారులు కల్యాణ రామ్,జూనియర్ ఎన్టీఆర్ విషాదంలో మునిగిపోతే, అందరూ ఓదార్చారు. అయితే హరికృష్ణ మృత దేహాన్ని చూడ్డానికి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ రాలేదు. ఇలా ముఖం చాటెయ్యడానికి గల కారణం ఏమిటో తెలియడం లేదు. నిజానికి అన్న హరికృష్ణతో బాలయ్యకు ఎన్ని విబేధాలున్నా సరే, వచ్చి దగ్గరుండీ అన్ని కార్యక్రమాలు చక్కబెట్టాడు.

బాలయ్య తో పాటు ఆయన భార్య , కూతుళ్లు కూడా వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. హరికృష్ణతో ఎపి సీఎం చంద్రబాబుకి విభేదాలున్నాయని అంటారు. అయినా సరే, చంద్రబాబు కూడా బావమరిది హరికష్ణ భౌతిక కాయం సందర్శించి శ్రద్ధాంజలి ఘటించడమే కాదు,అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటూ, చివరకు హరికష్ణ పాడెను కూడా మోశారు.

చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ కూడా అన్ని పనులు మానుకుని,అక్కడే ఉండి, అన్ని కార్యక్రమాలను చూసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇలా అందరూ అన్నీ పనులు ఆపెసుకుని,రెండు రోజులపాటు అక్కడే గడిపితే, కనీసం మోక్షజ్ఞ జాడలేదు. మృత దేహాన్ని చూడ్డానికి రాకున్నా,అంత్యక్రియల సమయానికి వచ్చినా సరిపోయేది.

ఎన్ని పనులున్నా పెదనాన్న పొతే రాకపోవడం ఏమిటని అందరూ చర్చించుకుంటున్నారు. ఒకవేళ విదేశాల్లో ఉండి రాలేదా, స్వదేశంలోనే ఉండికూడా డుమ్మా కొట్టాడా అన్నది చర్చనీయాంశం అయింది. అయితే ఇండియాలోనే ఉండికూడా మోక్షజ్ఞ రాలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పోకడ ఉంటే కష్టమని సన్నిహితులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. నందమూరి అభిమానులు అయితే మోక్షజ్ఞ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ రాకపోవడానికి గల కారణం మాత్రం బయటకు పొక్కలేదు.