బిగ్ బాస్ లో కౌశల్ క్రేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా… ఎందుకో తెలుసా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ కి మొదట్లో కాస్త ఆదరణ తక్కువగా ఉన్న రోజులు గడిచే కొద్దీ ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇంత ఆదరణ రావటానికి కౌశల్ ఆర్మీ ఒక కారణంగా చెప్పవచ్చు. ఒక సాధారణ సెలబ్రెటీగా హౌస్ లోకి అడుగు పెట్టిన కౌశల్ స్టార్ గా మారిపోయాడు. కౌశల్ అన్ని రకాలుగా తన ఆటతీరు, పద్దతి వాటి వాటితో అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు. దాంతో సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ హవా రోజురోజుకి పెరిగిపోతుంది. బిగ్ బాస్ రెండో సీజన్ మూడో వారానికి వచ్చేసరికి షో ని శాసించే స్థాయికి ఎదిగిపోయింది కౌశల్ ఆర్మీ. కౌశల్ కి వ్యతిరేకంగా ఉన్నా, కౌశల్ మీద ఆగ్రహం చూపించిన…వారిపై కౌశల్ ఆర్మీ తమ ప్రతాపాన్ని చూపుతుంది.

ఎంతలా చూపుతుందంటే వారు ఎలిమినేట్ అయ్యేదాకా వారి అంతూ చూస్తున్నారు. అందుకే నాని కూడా కౌశల్ ని టార్గెట్ చేయటం మానేసాడు. ఆ మద్య కౌశల్‌పై నాని ఆగ్రహం చేయడంతో బిగ్‌బాస్‌కు నాని అనర్హుడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసి పరువు తీశారు. అందుకే నాని ఎలాంటి వివాదాస్పదం కాకుండా కౌశల్‌ను స్కిప్‌ చేసేస్తున్నాడు.

ఈ సీజన్ మొత్తానికి కౌశల్ నామినెట్ అయ్యాడు. ఇక ప్రతి వారం కౌశల్ నామినేషన్ లో ఉంటాడు. కౌశల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండుట వలన కౌశల్‌ను బిగ్‌బాస్‌ స్క్రీన్‌పై ఎక్కువ చూపించకుండా, అతడి క్రేజ్‌ తగ్గించేలా బిగ్‌బాస్‌ టీం ప్రయత్నాలు చేస్తోంది. కౌశల్‌పై నెగటివ్‌ ఫీలింగ్‌ కలిగేలా మాత్రమే ఇకపై ఫీడ్‌ను ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

బిగ్‌బాస్‌ ఫైనల్‌ వరకు ఇలాగే పరిస్థితి కొనసాగితే విజేత కౌశల్‌ అంటూ అందరు ఒక నిర్ణయానికి వచ్చి షోపై ఆసక్తి తగ్గిపోతుందని, కౌశల్‌ను బ్యాడ్‌ చేయడం ద్వారా షోపై ఆసక్తి కలిగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.