హరికృష్ణ పుట్టినరోజున తల్లి చేసిన పనికి షాక్ అయినా ఎన్టీఆర్

నందమూరి అభిమానులకు కొండంత అండగా నిలుస్తూ వచ్చిన హరికృష్ణ మరణవార్త అందరినీ కలచివేస్తోంది. సినీ రంగంలో అలరించి రాజకీయ రంగంలో మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా,పనిచేసి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా వ్యవహరిస్తూ వచ్చారు. అభిమానులకు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆదుకోవడంలో హరికృష్ణ శైలి వేరు. అందుకే ఈయన మరణాన్ని ఎవరూ జీర్ణించు కోలేకపోతున్నారు. అందునా ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళికి నెల్లూరు జిల్లా కావలి వెళ్ళడానికి తనకు ఇష్టమైన డ్రైవింగ్ చేసుకుంటూ వేకువఝామున కారులో బయలుదేరిన హరికృష్ణ నల్గొండ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై దుర్మరణం పాలవ్వడం అందరినీ కలచివేస్తోంది.

హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ నాలుగేళ్ల కిందట ఇదే జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాదం నుంచి మెల్లిగా కోలుకుంటున్న సమయంలో అదే ఇంట్లో పెద్ద దిక్కుని కోల్పోవడం నిజంగా బాధాకరమే కదా. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ రామ్ కుటుంబాలకు తీరని లోటు. అందుకే నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

మరో నాలుగు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో అనుకోకుండా ఈ లోకం నుంచి నిష్క్రమించడం ఆ కుటుంబాన్ని మరీ కుంగదీసింది.
అయితే హరికృష్ణ రెండో భార్య,జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని చేసిన పనిచూసి జూనియర్ షాక్ తిన్నాడు. తనతల్లి ఇలా ఉందేంటి అంటూ నిర్ఘాంతపోయాడు. పేరుకి రెండో భార్య అయినప్పటికి హరికృష్ణ అంటే వల్లమాలిన ప్రేమగల షాలిని తన ప్రియాతిప్రియమైన భర్త పుట్టినరోజుకోసం ఏర్పాట్లు చేసుకున్నారట.

కానీ భర్త ప్రమాదంలో మరణించడంతో ఆమె కనీసం మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండిపోయింది. మృతదేహం వెళ్ళిపోయాక ఫోటోని తదేకంగా చూస్తూ తమ మధ్య గల అనుబంధాన్ని మరువలేక అలాగే ఉండిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యాడు. తన తల్లి మంచినీళ్లు తాగకుండా,తిండి తినకుండా,ఎవరితో మాట్లాడకుండా హరికృష్ణ పుట్టిన రోజునాడు ఫోటోని చూస్తూ, ఇలా విషాదంలో మునిగిపోవడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ మరింత కన్నీరు మున్నీరు అయ్యాడు. తన తల్లి పడుతున్న వేదనను భరించలేక,సన్నిహితుల దగ్గర,ఫ్రెండ్స్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ బాధపడుతున్నాడు . షూటింగ్స్ వెళ్లిపోవడం ద్వారా కొంత ఉపశమనం పొందాలని అనుకుంటున్నాడట.