Movies

పవర్ స్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్ముడు హీరోయిన్… ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

బాలీవుడ్ లో మ్యూజిక్ ఆల్బంలు, చిన్న సినిమాలు చేసుకునే ఒక నటిని పవన్ కల్యాణ్ ఏరికోరి ఎంపిక చేసుకోవడం అప్పట్లో చిత్ర పరిశ్రమను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. తమ్ముడు చిత్రంలో ఓ ఫ్రెష్ బ్యూటీ కావాల్సి రావడంతో పవన్ ఉత్తరాదికి చెందిన ప్రీతి జింగానియాను హీరోయిన్ గా తీసుకువచ్చాడు. ఈ అమ్మాయి హీరోయినా అంటూ ఇండస్ట్రీ వర్గాలు పెదవి విరిచాయి. కానీ తమ్ముడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ క్రేజ్ ఆకాశానికి ఎగబాకడమే కాదు ప్రీతి జింగానియా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఆ తర్వాత అమ్మడు తెలుగులో నటించింది తక్కువే అయినా బాలీవుడ్ లో బాగా పేరుతెచ్చుకుంది. ప్రీతి జింగానియా ముంబయిలో ఓ సింధీ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మేనక, గోవింద్ జింగానియా ఎంతో గారాబంగా పెంచారు. బాల్యం నుంచి నటన అంటే ఎంతో మక్కువ చూపించే ప్రీతి కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ చేసింది. అనేక సంస్థలకు మోడల్ గా చేస్తుండగా రాజశ్రీ ప్రొడక్షన్స్ రూపొందించిన యే హై ప్రేమ్ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. ఇందులో ఆమె సరసన నటించింది అబ్బాస్ కావడం విశేషం.

అప్పటికి అబ్బాస్ కూడా హీరో కాలేదు. 1999లో మళవిల్లు అనే మలయాళ చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. అదే ఏడాది తమ్ముడు చిత్రంతో టాలీవుడ్ రంగప్రవేశం చేసిన ప్రీతి జింగానియా ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. తమ్ముడు సినిమాలో హీరోయిన్ కోసం ఎంతో మంది అమ్మాయిలను ఆడిషన్ చేశారు.

కొన్ని వందలమందిని చూసినా అమాయకంగా కనిపించే ఫేస్ లేకపోవడంతో పవనే స్వయంగా ముంబయి వెళ్లి తనకు తెలిసినవాళ్లందరినీ ఎంక్వైరీ చేశాడట. చివరికి హోటల్ రూమ్ లో టీవీ చూస్తుండగా ఓ మ్యూజిక్ వీడియోలో ప్రీతి జింగానియాను చూసి ఆమే తన హీరోయిన్ అని డిసైడై వెంటనే ఆమె వివరాలు తెలుసుకున్నాడట. ఇక ఆ తర్వాత జరిగింది మనకు తెలిసిందే. టాలీవుడ్ లో తమ్ముడు సినిమా చరిత్ర సృష్టించింది.

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసిందంటే అతిశయోక్తికాదు. మొదట్లో నిరాశ పరిచినవాళ్లే ఆ తర్వాత ప్రీతి జింగానియాను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ్నించి ఆమెకు సెలబ్రిటీ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత ప్రీతి బాలీవుడ్ తో పాటు అనేక దక్షిణాది భాషల్లో సినిమాలు చేసినా తమ్ముడు ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. ఇక ప్రీతి జింగానియాది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పుకోవాలి. నటుడు, దర్శకుడు అయిన పర్వీన్ దబాస్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది.

ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఆమె ప్రేమకు అడ్డంకలు ఏర్పడలేదు. 2008లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంది. ప్రీతికి ఇద్దరు అబ్బాయిలు కలిగారు. వాళ్ల పేర్లు జయవీర్, దేవ్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో నివసిస్తోంది. పెళ్లి తర్వాత ఎక్కువగా బెంగాలీ, రాజస్థానీ చిత్రాలు చేసుకుంటూ ఉంది. ఇప్పటికీ ఆమె పవన్ కల్యాణ్ అంటే ఎంతో కృతజ్ఞతాభావం చూపిస్తుంది. ఎక్కడో అనామకురాలిగా ఉన్న తనను ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ చేసింది పవన్ కల్యాణే అని, ఆయనకు ఎంతో రుణపడి ఉంటానని చెబుతోంది ప్రీతి జింగానియా.