బిగ్ బాస్ అర్చన ఇప్పుడు ఏమి చేస్తుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ లో అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్స్ లలో అర్చన ఒకరని చెప్పవచ్చు. తపన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నేను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అర్చన నటనకు విమర్శకులు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. ఆ తర్వాత కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, సూర్యం సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దన్నానా’ సినిమాలో కీలకమైన పాత్రను పోషించి మంచి గుర్తింపును సాధించింది.
అర్చనకు మొదటి నుంచి చిన్న హీరోలతో జోడి కట్టటం వలన ఆమెకు స్టార్ హీరోయిన్ గా ఎదగాలనే కోరిక మాత్రం తీరలేదు. పౌర్ణమి,శ్రీ రామదాసు,యమ దొంగ వంటి సినిమాల్లో మంచి పాత్రలు లభించిన అవి క్యారెక్టర్ రోల్స్ కావటంతో హీరోయిన్ గా ఎదిగే ఛాన్స్ లేకపోయింది. ఆ మధ్య వచ్చిన బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసిన అర్చన బాగానే ఫెమస్ అయింది. ముద్దు ముద్దు మాటలతో చిన్న పిల్ల మనస్తత్వంతో బిగ్ బాస్ హౌస్ కి వన్నె తెచ్చింది. బిగ్ బాస్ లో చివరి వరకు పోటీలో ఉన్నా కొద్దిలో టైటిల్ విన్నర్ కాలేకపోయింది.
ఆ తర్వాత మంచి సినిమాలు కమిట్ కాకపోవడానికి తన మేనేజర్స్ కారణం అని మీడియాకి చెప్పి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాను ఎంత పారితోషికం తీసుకుంటున్నానో ఇతర హీరోయిన్స్ కి చెప్పి తనకు అవకాశాలు రాకుండా చేసారని మేనేజర్స్ మీద మండి పడింది అర్చన. కెరీర్ లో ఉన్నత స్థితికి వెళ్ళాక పెళ్లి గురించి ఆలోచిస్తుందట. ప్రస్తుతం చేతిలో ఏ సినిమాలు లేకపోవటంతో తానే ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలనే ఆలోచనలో ఉంది.ఎవరో అవకాశాలు ఇస్తారని వెయిట్ చేయటం కన్నా తనే నిర్మాతగా మారి సినిమాలు చేసుకుంటే బాగుంటుందని తన సన్నిహితుల వద్ద చెప్పిందట అర్చన. ప్రస్తుతం కథలు వినే పనిలో ఉందట. మంచి కధ దొరకగానే నిర్మాతగా, హీరోయిన్ గా ముందుకు రావటానికి రెడీగా ఉంది. మంచి యూత్ లవ్ స్టోరీతో రావాలని ప్లాన్ చేస్తుంది. అర్చన సెకండ్ ఇన్నింగ్స్ హ్యాపీగా సాగాలని కోరుకుందాం.