కొడుకు స్టార్ హీరో అయినా…ఇప్పటికి “నాని” తల్లితండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా..?

నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమకు వచ్చి ‘ఆలా మొదలైంది’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకొని మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారదు. నానితో సినిమా అంటే నిర్మాత హ్యాపీగా ఉండొచ్చు అనేలా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నాని సినిమాలు కుటుంబం మొత్తం చూసే విధంగా ఉంటాయి. అలానే ఎంచుకుంటూ హిట్ కొడుతున్నాడు. ఈ రోజు నాని MCA సినిమా విడుదల అయింది. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం నాని తల్లి తండ్రి గురించి ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది. Nani Father And Motherఒక పక్క నాని సంపాదన,మరో పక్క నాని భార్య అంజనా కూడా సంపాదిస్తుంది. అంజనా ఫ్యాషన్ డిజైనర్ అన్న విషయం మనకు తెలిసిందే. ఆమె బాహుబలి సినిమాకు వర్క్ చేసింది. కాబట్టి నాని తల్లితండ్రులు మనవణ్ణి ఆడిస్తూ ఇంటిలో హ్యాపీగా గడిపేయచ్చు. కానీ ఇప్పటికి నాని అమ్మగారు ఉద్యోగం చేస్తారు. ఆమె సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నారు. ఆమెకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఆఫీస్ కి బస్ లోనే వెళతారు. నాని తండ్రి కూడా ఉద్యోగం చేస్తారు. కష్టపడి పైకి వచ్చిన నానికి కష్టం విలువ తెలుసు కాబట్టి తల్లి తండ్రిని రెస్ట్ తీసుకోమని చెప్పాడట. కానీ వారు ఓపిక ఉన్నంత వరకు ఉద్యోగం చేస్తామని చెప్పారట. నేచురల్ స్టార్ నాని తల్లితండ్రులకు హ్యాట్సాఫ్ చెప్పాలి.Nani Mother