పవన్ సినిమాల్లో నటించటానికి సిద్ధం అవుతున్నాడా… ఈ వార్తలో ఎంత నిజం ఉందో?

ఆనాడు ఎన్టీఆర్ సినిమాలు వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయాల్లో అందునా సీఎం గా ఉంటూ కూడా సినిమాల్లో నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరంగా ఉన్నా, మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసి, రాజకీయంగా యాక్టివ్ తగ్గించారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. జనసేన పార్టీ పెట్టిన ఈయన వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటూ సినిమాలను వదిలేసి జనంలో తిరుగుతున్నారు.

నిజానికి పవన్ కేవలం 25సినిమాలే చేసినా సరే,స్టార్ డమ్ మాత్రం అనూహ్యంగా తెచ్చుకున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే, ఇక చెప్పక్కర్లేదు. అయితే తమ అభిమాన నటుడు మళ్ళీ వెండితెరమీద ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురుచూస్తున్న సమయంలో ఓ వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే ఆయన సినిమాలో నటిసుస్తున్నారట. అసలు విషయానికి వెళ్తే, పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వైష్ణవ తేజ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే వైష్ణవ తేజ్ కోసం గోపాల గోపాల ,కాటంరాయుడు ఫేమ్ డైరెక్టర్ కిషోర్ పార్ధ సాని అలియాస్ డాలి ఓ స్టోరీ సిద్ధంగా ఉంచాడట. ఇందులో ఓ పవర్ ఫుల్ రోల్ ని పవన్ తో చేయించాలని డాలి అనుకుని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మరోపక్క రవితేజతో నేల టికెట్ తీసిన నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట.

పవన్ కి రామ్ తాళ్ళూరి మంచి మిత్రుడు కావడం, మరోపక్క మేనల్లుడు సినిమా కావడం వంటి నేపథ్యంలో సినిమాలో ఆ రోల్ వేయడానికి ఒకే చెప్పేసినట్లు వార్తలు అందుతున్నాయి. అయితే పవన్ నోటి వెంట వస్తేనే ఈ న్యూస్ పక్కాగా కన్ఫర్మ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో.