Movies

‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

తెలుగు సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీస్ కి కొదవలేదు. ఇంచుమించు అందరి హీరోలకు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అయితే ఇలాంటి సినిమాల్లో హీరోహీరోయిన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో,బాలనటులుగా వేసిన వాళ్లకు అదే రీతిలో గుర్తింపు వచ్చేస్తుంది. ఆవిధంగా మనందరికీ తెల్సిన ఈ మధ్య కాలంలోని రేసు గుర్రం మూవీ. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఎంటర్ టైం మెంట్ , యాక్షన్ పాళ్ళు బాగా కనిపిస్తాయి. ఇక ఈ మూవీలో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్రలో ఒదిగిపోయి మెప్పించిన బాలనటుడు ఎవరంటే, విక్రమ్ సాయిదేవ్.

అల్లు అర్జున్ చిన్నప్పుడు లక్కీ పాత్రలో వేసిన సాయిదేవ్ కి గుర్తింపు బానే వచ్చింది. యితడు కూడా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ దండిగానే వుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త,సినిమా నిర్మాత, లాంకో అధినేత లగడపాటి శ్రీధర్ కుమారుడే యితడు. రాజకీయ నేపధ్యం కూడా గల శ్రీధర్ సినిమా రంగంలో రామలక్ష్మి క్రియేషన్స్ పేరిట సొంత బ్యానర్ పెట్టి, ఎవరి గోల వారిదే,కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ,స్నేహ గీతం,పోటుగాడు,సికిందర్ , నాపేరు సూర్య,వంటి మూవీస్ నిర్మించాడు.

విజయవాడ ఎంపీ గా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ కి సోదరుడైన శ్రీధర్ ఎన్నో సినిమాలు తీస్తే, శ్రీధర్ కొడుకు రేసు గుర్రం తో మొదలుపెట్టి,పటాస్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మూవీస్ లో బాలనటుడిగా మెప్పించాడు. అంతేకాదు ఇప్పుడు హీరో వంటి కీలక పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో హిట్ అయి, తెలుగులో గోలీ సోడా గా వస్తున్న మూవీలో లీడ్ రోల్ ఓ హీరోగా వచ్చాడు.