Movies

షావుకారు జానకి మనవరాలు స్టార్ హీరోయిన్…మనవడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్… ఎవరో చూడండి

అలనాటి నటుల్లో క్రమశిక్షణ ఎక్కువ ఉండేది. తమను తాము తీర్చిదిద్దుకుంటూ తమ వారసత్వాన్ని కూడా మంచి పొజిషన్ లో ఉంచడానికి శ్రమించారు. ఈ కోవలోకి వచ్చే అలనాటి నటి షావుకారు జానకి ఒకరు. దాదాపు 35ఏళ్ళు సినీ రంగాన్ని ఏలిన ఈమె నిజానికి పొట్టకూటికోసం సినీ రంగానికి వచ్చారు. ఇంకా చెప్పాలంటే,కేవలం మూడు నెలల పిల్లని పెంచడం కోసం,ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, అగ్రశ్రేణి హీరోయిన్ గా ఎదిగి,పరిశ్రమను ఓ ఊపు ఆపేసారు ఈవిడ.

దాదాపు 150 నాటకాల్లో వేసిన జానకి పెళ్లయ్యాక పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా తోనే హీరోయిన్ గా నటించి,మంచి పేరుతెచ్చుకున్న జానకి, ఆ సినిమాతోనే తన ఇంటిపేరును కూడా షావుకారుగా చేసుకున్నారు. 1931డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన ఈమె ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చారు.

రేడియోల్లో వచ్చే నాటకాలు సంభాషణలు చెప్పేవారు. తెలుగు,హిందీ, తమిళం, కన్నడ,మలయాళం భాషల్లో దాదాపు 400చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే వున్నారు.సినీ హీరోయిన్ గా 1949నుంచి 1975వరకూ దాదాపు 30ఏళ్లపాటు జానకి సినిమాల్లో తన హవా సాగించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ , తమిళంలో శివాజీ గణేశన్,ఎంజీఆర్, జెమిని గణేశన్, వంటి అగ్ర హీరోల సరసన నటించారు.

రోజులు మారాయి సినిమా వచ్చి 55ఏళ్ళు అవుతున్నా, అందులో షావుకారు జానకి ‘ఏరువాక సాగరో .’పాటలో వయ్యారంగా నడుం తిప్పుతూ ఈమె చేసిన నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆ సినిమా సమయానికి ఆమె వయస్సు కేవలం 18ఏళ్ళు. పైగా మూడు నెలల కూతురు కూడా ఉంది.జానకి భర్త చిన్న ఉద్యోగి. అయితే కుటుంబం గడవడం కోసం ఆమె ఇండస్ట్రీకి వచ్చారు.

మహానటి సావిత్రి వంటి వాళ్ళతో పోటీపడి నటించిన ఈమె, నిజానికి దేవదాసు సినిమాలో పార్వతి పాత్రలో నటించాల్సి ఉందట. అయితే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇక కన్యా శుల్కం సినిమాలో బుచ్చమ్మ పాత్ర ఈమె నటజీవితంలో మైలురాయి. ఇక ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా అలనాటి హీరోయిన్ కావడం మరో విశేషం. నిజానికి వీళ్ళిద్దరూ ఒకేసారి సినీ రంగాన్ని ఏలారు.

ఇక జానకి కుటుంబం నుంచి సినీ రంగంలో రాణిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారట. ఈమె మనవరాలు వైష్ణవి తెలుగులో శుభ సంకల్పం,పరువు ప్రతిష్ట, అత్తింటిలో అద్దె మొగుడు,ప్రేమ వంటి మూవీస్ లో నటించింది. తెలుగులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేసినప్పటికీ మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఉంది.

ఇక కొలవెరి మ్యూజిక్ తో దేశాన్ని ఓ ఊపు ఊపేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వైష్ణవికి సోదరుడే. రజనీకాంత్ భార్య లత స్వయానా ఈమె మేనత్త. వైష్ణవికి సూపర్ స్టార్ రజనీ వైష్ణవికి మేనమామ అన్నమామ అవుతాడన్నమాట. మరి షావుకారు జానకి, రేంజ్- ఇమేజ్ చూసారుగా .