కౌశల్ భార్య నీలిమ కౌశల్ ఆర్మీ గురించి చెప్పుతూ కౌశల్ కి ఏమి చెప్పిందో తెలుసా?

ఏదైనా పైకి వెళ్లడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. ఏమరపాటుతో చిన్నపొరపాటు చేసినా ప్రమాదమే. అలాగే అభిమాన జనాన్ని సంపాదించుకోవడం చాలా గొప్ప విషయమే అయితే వాళ్ళు పెట్టుకున్న ఆశలను కూడా నెరవేర్చాలి. అప్పుడే సార్ధకత వస్తుంది. ఇదంతా ఎందుకంటే, కౌశల్ కి అతని భార్య చేసిన సూచనలు అలాంటివి మరి. సినీ, టివి నటుడిగా, బిజినెస్ మ్యాన్ గా ఉన్న కౌశల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక ఎనలేని అభిమానం సొంతం చేసుకున్నాడు. అభిమానులు ఉప్పొంగిన ఉత్సాహంతో కౌశల్ ఆర్మీ పేరిట చేస్తున్న పనులు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానవు. కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2కె రన్ గురించి కౌశల్ కి నీలిమ వివరిస్తూ అంతమంది జనం వచ్చారంటే మామూలు విషయం కాదని చెప్పింది.

బిగ్ బాస్ షో 100రోజులకు చేరుకుంటున్న తరుణంలో హౌస్ మెంబర్స్ కి సర్ఫరైజ్ ఇస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంటిలోకి ప్రవేశ పెట్టాడు బిగ్ బాస్. దీంతో అందరిలో భావోద్వేగాలు చెలరేగాయి. హౌస్ అంతా ఎమోషన్ తో నిండిపోయింది. ఇక హౌస్ లో ఎప్పుడూ గంభీరంగా కనిపించే కౌశల్ తన భార్య పిల్లలను చూడగానే ఏడుపు ఆపుకోలేక పోయాడు.

పిల్లలను ఎత్తుకుని వాళ్ళను మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యాడు. నిజానికి బిగ్ బాస్ షో కి ఇంతటి పాపులారిటీ రావడానికి ఓ విధంగా కౌశల్ కారణం. అతనికి ఉన్న ఫాలోయింగ్ తో బిగ్ బాస్ షోకి ట్రెండ్ సెట్టర్ అయ్యాడు.అయితే బయట విషయాలు కౌశల్ కి అంతగా తెలియక పోవడంతో కౌశల్ ఆర్మీ గురించి నీలిమ వివరిస్తూ ఎమోషనల్ అయింది.

ఎందుకంటే కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2కె రన్ లో పసిపిల్లలను ఎత్తుకుని కూడా కొందరు పాల్గొంటే, మరికొందరు పెద్దవాళ్ళు కూడా పాల్గొని ఆశీర్వదించారని, ఇక చిన్న పిల్లలు కదం తొక్కారని ఆమె వివరిస్తూ,కేవలం నీ మీద అభిమానంతో మండుటెండలో సైతం పసి పిల్లలను ఎత్తుకుని రన్ లో పాల్గొన్నారని చెప్పుకొచ్చింది.

నీ బాధ్యత మరింత పెరిగిందని నిన్ను ఆరాధించే అభిమానులకోసం గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని, వారికోసం సీజన్ టైటిల్ గెలవాలని సూచించింది. ఇప్పటికే జనం దృష్టిలో టైటిల్ గెలిచేశావని,ఇక మీ తల్లికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నావని, ఇంతమంది అభిమానులను చూసిన నీ తల్లి సంతోషానికి హద్దుల్లేవని చెప్పడంతో కౌశల్ కూడా ఎమోషన్ అయ్యాడు.