బిగ్ బాస్ ఎనాలసిస్ కౌశల్ ని హౌస్ నుండి బయటకు పంపేందుకు భారీ స్కెచ్

బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ టు మరికొన్ని రోజుల్లో ముగిసిపోనుంది. దీంతో కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీ పోరు కోనసాగుతోంది. ఇక విన్నర్ అవ్వడం ఖాయమనే మాటలు వినవస్తున్నాయి. ఎందుకంటే కౌశల్ ఆర్మీ పవర్ దేశం హద్దులు దాటి వెళ్ళిపోయింది. కౌశల్ కి అనూహ్యమైన పాపులారిటీ సొంతం అయింది. సీజన్ వన్ లో ఫామిలీస్ ని ఆహ్వానించి కంటెస్టెంట్స్ తో సందడి చేయించిన మాదిరిగానే ఈసారి కూడా హౌస్ మెంబర్స్ ఫ్యామిలీస్ ని పిలిపించి కంటెస్టెంట్స్ కి షాకిచ్చారు. మొత్తాన్ని ఇది బానే ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే బిగ్ బాస్ ఇప్పుడు ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేసాడట.

దీనిప్రకారం కౌశల్ పాపులారిటీ ని దెబ్బకొట్టి,ఓట్లు తగ్గించడం ద్వారా ఇంటికి పంపాలన్నది ఈ ప్లాన్ లో భాగమని కొందరు విశ్లేషకులు చేస్తున్న వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో హిందీ బిగ్ బాస్ లో విపరీతమైన పాపులారిటీ గల గౌతమ్ గులాటి తో ఆడిస్తే, హౌస్ మేట్స్ అందరూ ఆ టాస్క్ తర్వాత అతడికి వ్యతిరేకం అయ్యారట. తమిళంలో కూడా ఇలా జరిగిందట.

అదేంటంటే, హౌస్ ని ప్రజా దర్భార్ గా అంటే ఓ సిటీగా మార్చేసి,హౌస్ మేట్స్ ని ప్రజలుగా చూపించి , కౌశల్ ని ఓ కింగ్ గా ప్రకటించడం ఈ ప్లాన్ లోని ఓ భాగం అంటున్నారు. హౌస్ మేట్స్ అందరూ కింగ్ ఏది చెబితే అది చేయాలి. ఒకవేళ కాదని ఎవరైనా ఎదురు తిరిగితే, భయంకరమైన శిక్షలు వేయడం,దారుణంగా దండించడం చేస్తాడు. ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఈ టాస్క్ ద్వారా కౌశల్ క్రేజ్ ని తగ్గించే యత్నం చేయాలని చూస్తున్నారట.

దీనివలన ఓట్లలో చీలిక తెచ్చి, కౌశల్ ని దెబ్బతీయాలని పక్కా ప్లాన్ రూపొందిస్తున్నట్టు కధనాలు కూడా వస్తున్నాయి. హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో ఆడించిన ఇలాంటి ఆట బాగా వర్కవుట్ అయిందని, ఫలితంగా అప్పుడు గ్రాండ్ ఫినాలిలో ఓట్లు చీలిక వచ్చిందని, అయితే చివరకు గూటం గులాటి విన్నర్ అవ్వడం జరిగినా, ఈ ఆట మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు గుర్తుచేస్తున్నారు.

ఇక తమిళంలో కూడా ఐశ్వర్య దత్తా అనే అమ్మాయిని క్వీన్ గా ప్రకటించి ఆడించిన ఇలాంటి టాస్క్ ఆట ఆడించారు. అలాగే కొన్ని ప్రాంతీయ భాషల్లో జరిగింది. ఈ టాస్క్ గేమ్ వలన షూ తుడిపించడం, బాడీ మసాజ్ చేయించడం, కాలిగోళ్ళు తీయమనడం,రాజాను పొగుడుతూ పాటలు పడమనడం, అండర్ వేర్ లను ఉతికించటం ఇలాంటి పనులతో ఈ టాస్క్ డిజైన్ చేసి ఉంటాయి. అయితే ఈ పనులు చేయడానికి సాధారణంగా ఎవరూ ముందుకు రారు.

అప్పుడు శిక్ష వేసే అధికారం కింగ్ కే ఉంటుంది. దీనివలన ఆడియన్స్ లో కూడా కింగ్ డిక్టేటర్ రూలర్ గా కనిపించి చిరాకు వచ్చేలా చేస్తుంది. దీనివలన ఓట్లు కూడా తగ్గుతాయి ఈ ప్లాన్ వర్కట్ అయితే కౌశల్ కి ఇబ్బందేనని విశ్లేషకుల అంచనా. ఇదే వర్కవుట్ అయితే ఎలిమినేటి అయ్యే ప్రమాదం కూడా పొంచి వుందని అంటున్నారు. మరి ఏమౌతుందో చూద్దాం.