కౌశల్ ప్రవర్తనలో పూర్తిగా చేంజ్ వచ్చేసిందా? మార్పుకి కారణం ఏమిటి?

బిగ్ బాస్ సీజన్ టు ముగియబోతున్న తరుణంలో గేమ్ రంజుగా సాగుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫామిలీ మెంబర్స్ ఎంటర్ అయ్యాక అందరిలో కొద్దో గొప్పో మార్పు వచ్చిందని అనిపిస్తోంది. ఇక ఇన్నాళ్లూ ఒకలాగ వ్యవహరించిన కౌశల్ ఇప్పుడు తన పంథాను పూర్తిగా మార్చేసుకున్నాడా అనిపిస్తోంది. ఎందుకంటే ఎవరితో వాదనకు దిగవద్దని, మీరు మీరులా ఉండండి అని కౌశల్ భార్య నీలిమ చేసిన సూచన వెంటనే అమల్లో పెట్టిసినట్లు తాజాగా జరిగిన ఎపిసోడ్ లో తేటతెల్లం అయింది. ఇక ఫైనల్ స్టేజికి వచ్చేసినందున ఎవ్వరితోనూ వివాదం లేకుండా, ఆందరితో ఒకేలా ఉండాలని భావించడం మనం గమనిస్తాం.

హౌస్ లో పాజిటివ్ మార్పు తీసుకు వచ్చే విధంగా కౌశల్ యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కంటెస్టెంట్స్ ఏదైనా తప్పు చేస్తే, అలా కాదు, ఇలా కాదు అని చెప్పడం, కామెంట్స్ చేయడం,టాస్క్ లలో అందరిలాగే వ్యవహరించడం చేసే కౌశల్ తాజాగా నిన్నటి ఎపిసోడ్ చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాడని చెప్పవచ్చు. రిమోట్ కంట్రోల్ టాస్క్ లో మిగిలిన కంటెస్టెంట్స్ ఎలా వ్యవహరించినా కౌశల్ మాత్రం డిఫరెంట్ గానే వున్నాడు.

కౌశల్ నెత్తిమీద పిల్లో పెడితే, చేతిలో అరటి పళ్ళు పెట్టినా ఏమాత్రం స్పందించలేదు. ఏ కామెంట్ చేయలేదు. దీప్తి ఫ్రీజ్ అయినపుడు హెయిర్ ని పక్కకు పెట్టడం వంటివి అమిత్ తదితరులు చేసారు. సామ్రాట్ ఫ్రీజ్ లో ఉన్నప్పుడు అతన్ని డిస్ట్రబ్ చేయడం,వంటివి చూసాం. అయితే కౌశల్ గతంలో మాదిరిగా ఈ గేమ్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు.

రోల్ రైడా ఫ్రీజ్ లో ఉన్నప్పుడు పాన్ తెచ్చి పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేదు. సదరు పాన్ ని గీతా తీసేసి పక్కన పెట్టినా కౌశల్ ఏమీ కామెంట్ కూడా చేయలేదు. ఎంత ఎమోషనల్ గా కౌశల్ ఉంటాడో అంతటి సంస్కారం కూడా అతనిలో కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ సామ్రాట్ తల్లి హౌస్ లోకి వస్తే మొట్టమొదటగా కౌశల్ ఆమె కాళ్లకు మొక్కడమే.

ఆమెలో ఓ తల్లిని చూసుకుంటూ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటివరకూ అలా కాదు, ఇలా ఉండాలి అంటూ అందరికీ చెప్పే ప్రయత్నం చేసిన కౌశల్ ఇప్పుడు అందరినీ మంచిగా గెలుచుకునే యత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ చివరి అంకంలో కౌశల్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో అనడానికి నిన్నటి ఎపిసోడ్ తార్కాణం అని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో.