కౌశల్ భార్య కౌశల్ ఆర్మీ గురించి ఎంత సింపుల్ గా అర్ధం అయ్యేలా చెప్పిందో చూడండి?

ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఏడాది ఉంటుందని అంటారు. అది కౌశల్ విషయంలో నూటికి నూరు శాతం నిజమని పలువురు అంటున్నారు. కౌశల్ భార్య నీలిమ చాలా తెలివైన వారని,కౌశల్ కి ఏది చెప్పాలో అదే చెబుతూ ముందుకు నడిపిస్తున్న ఘనత ఆమెదేనని పలువురు చెబుతున్నారు. ఇంటి సభ్యుల నుంచి వచ్చిన కాల్స్ విషయం పరిశీలిస్తే, హౌస్ బయట గల వాతావరణాన్ని కౌశల్ కి సూటిగా చెబుతూ సూచనలు చేయడం ద్వారా నీలిమ తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక మొన్న హౌస్ లోకి కంటెస్టెంట్స్ కుటుంబాలను హఠాత్తుగా బిగ్ బాస్ ప్రవేశ పెట్టడంతో భార్య నీలిమ, పిల్లలను చూసి కౌశల్ ఎమోషన్ అయ్యాడు.

మిగతా హౌస్ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు కబుర్లు, క్షేమ సమాచారాలతో ఎక్కువ సేపు గడిపేస్తే, కౌశల్ భార్య నీలిమ మాత్రం తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేసి, అతని ఆత్మవిశ్వాసం నింపారు. బిగ్ బాస్ ఆడియన్స్,కౌశల్ ఆర్మీ తమ అభిమాన కౌశల్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు, వాళ్ళు కోరుకునేదానికి అనుగుణంగా ఎలా ఉండాలి, టైటిల్ గెలవడం కోసం మిగిలిన రోజుల్లో ఎలా వ్యవహరించాలి వంటి విషయాలను ఆమె పూసగుచ్చినట్లు కౌశల్ కి వివరించి చెబుతూ సూచనలు చేసారు.

సరిగ్గా అదే కౌశల్ ఆర్మీకి బాగా నచ్చింది.తాము కోరుకుంటున్న విషయం ఏమిటో అదే కౌశల్ కి చేరవేసిన నీలిమ చాలా ఇంటిలిజెంట్ అని పలువురు అంటున్నారు. ‘ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు, ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకోవడద్దు, ఒంటరినని అసలు ఫీలవ్వద్దు,మీరు మీలా ఉండండి. అదే మాకు ఆనందం.

బయట మీరు లాన్ లో తిరుగుతున్నప్పుడు ఒంటరి అనుకోవద్దు,మీకు వెనుక మేమున్నాం,మేమంతా గర్వం గా తలెత్తుకునేలా చేసారు మీరు’అంటూ నీలిమ కౌశల్ కి చెప్పుకొచ్చింది. బాహుబలి లాంటి కౌశల్ హౌస్ లో తనకు ఏమాత్రం సాటిరాని, కంటికి కనిపించని వారితో వాదనకు దిగడం తమకు నచ్చడం లేదని అసలు అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దని కౌశల్ ఆర్మీ కోరుకుంటోందని నీలిమ చెబుతూ అన్ని విషయాలు వివరించడం కౌశల్ ఆర్మీకి బాగా నచ్చింది.