హౌస్ లో ఎవరు ఉంటారు….ఎవరు వెళతారో చూస్తే చాలా ఆశ్చర్యపోతారు

బిగ్ బాస్ తెలుగులో మొదలుపెట్టాక తొలిసీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ తో అదరగొట్టారు. అప్పుడు 70ఎపిసోడ్స్ నడిచింది. అయితే హీరో నాని యాంకర్ గా మొదలైన సీజన్ 2 మొత్తం 100ఎపిసోడ్స్ గా నిర్ణయించారు. ఇప్పటికే 93ఎపిసోడ్స్ పూర్తిచేసుకుని, చివరి అంకానికి చేరింది. ఇక మరో 7ఎపిసోడ్స్ మిగిలాయి. ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ తో 17మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన హౌస్ ని నేచురల్ స్టార్ నాని తనదైన శైలిలో నడుపుతున్నాడు. ప్రస్తుతం 7గురు మెంబర్స్ హౌస్ లో మిగిలారు. పరిస్థితులు ఒకవేళ తారుమారు అయితే ,హౌస్ లోంచి కౌశల్,గీతా బయటకు వచ్చినా రావచ్చని వినిపిస్తోంది.

గీతా మాధురి,దీప్తి నల్లమోతు,తనీష్, అమిత్ ,కౌశల్, సామ్రాట్, రోల్ రైడా లు మిగలడంతో ఆసక్తికర పోరు నడుస్తోంది. ఇక ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియలో తనీష్, సామ్రాట్ మినహా మిగిలిన 5గురు నామినేషన్ లో ఉన్నారు. అమిత్, గీతా మాధురి,దీప్తి , రోల్ రైడా ,కౌశల్ నామినేషన్ లో ఉన్నందున ఇందులో ఈవారం ఇద్దరు ఎలిమినేషన్ కాబోతున్నారు.

సింగర్ గీతా ఎఫెక్ట్ తో సీజన్ మొత్తం ఎలిమినేషన్ లో ఉన్న కౌశల్ ఈవారం కూడా ఎలిమినేషన్ జోన్ లోనే ఉన్నాడు. అయితే టైటిల్ రేస్ లో అందరి కన్నా చాలా అగ్రభాగాన కౌశల్ ఉంన్నాడు.కాగా కౌశల్ కి గట్టిపోటీగా నిల్చిన గీతా ఈవారం ఎలిమినేషన్ జోన్ లోకి రావడంతో కౌశల్ ఆర్మీ ప్రభావం ఎలా తుంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.

గతవారం తప్పించుకున్న దీప్తి,అమిత్ లు ఈసారి ఎలిమినేషన్ నుంచి గట్టెక్కుతారా అంటే లేదనే మాట వినవస్తోంది. అలాగే రోల్ కి కూడా ఈ ఎలిమినేషన్ కీలకం అయింది. కౌశల్ కి ఓట్ల శాతం అధికంగా ఉండడం తెలిసిందే. గీతకు కూడా ఓట్లు బానే వస్తున్నాయి. వీల్లద్దరినీ పక్కన పెడితే దీప్తి, రోల్,అమిత్ లకు ప్రమాదం పొంచివుందని చెప్పాలి. దీప్తి ఒకవేళ తప్పించుకుంటే,రోల్, అమిత్ లకు ప్రమాదం అంచున వున్నట్టే. ఒకవేళ సీన్ రివర్స్ అయితే గీతా, కౌశల్ బయటకు వచ్చినా వచ్చెయ్యవచ్చని అంటున్నారు. ఎందుకతనే బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చు కదా.