బిగ్ బాస్ రెండో సీజన్ లో ఫైనల్ కి వెళ్ళేది వీరే?

బిగ్ బాస్ షో ముగింపునకు సమయం దగ్గర పడుతోంది. ఇన్నాళ్లూ ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టుగా హౌస్ లో పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉత్కంఠ కూడా ర్యాజ్యమేలుతోంది. ముఖ్యంగా టాప్ త్రి లో ఎవరు ఉంటారో అనేదానిపై చర్చలు జోరుగానే సాగుతున్నాయి. ఇప్పటికే కౌశల్ విన్నర్ అవుతాడని అనుకుంటున్న నేపథ్యంలో ముందుగా గ్రాండ్ ఫైనాలికి వెళ్లడం ముఖ్యమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముందు నుంచీ హౌస్ లో కౌశల్ పట్ల కంటెస్టెంట్స్ వ్యవహరించిన తీరు అతనిపై ఓవరాల్ గా సానుభూతి పెంచేసాయి. అతని ప్రవర్తన కూడా పాజిటివ్ గా ఉండడంతో ఆడియన్స్ ల మంచి మార్కులు కొట్టేసాడు.

హౌస్ మేట్స్ చేసిన తప్పులు కొన్ని చోట్ల కౌశల్ ని హీరోగా మార్చేస్తే, మరి కొన్నిచోట్ల అతని నిర్ణయాలు ప్రజాభిమానాన్ని దండిగా పొందేలా చేశాయి. అందుకే పలువురు విశ్లేషకులు సైతం కౌశల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో దూస్తుకుపోవడానికి కూడా హౌస్ మేట్స్ మిస్టేక్స్ ప్రధాన కారణం.

రెండవ వారంలో కిరీటి వ్యవహారం, ఆ తర్వాత భానుశ్రీ , తేజస్వి ఇలా ఏ వ్యవహారం చూసినా కౌశల్ కి అభిమాన తరంగం ఉవ్వెత్తున్న ఎగిసి పడింది. అందుకే టాప్ ప్లేస్ కి కౌశల్ చేరడం ఖాయమని ప్రతి ఒక్కరూ ఘంటాపధంగా చెప్పేమాట. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, గీతా మాధురి కూడా గ్రాండ్ ఫినాలే కి సెలక్ట్ కావడం ఖాయం.

టాస్క్ ల్లో ఆమె చూపిన ప్రతిభ,కెప్టెన్సీలో వ్యవహరించిన తీరు,మాట విధానం ఇలా ఎన్నో అంశాలు ఆమెకు మంచి మార్కులు పడేలా చేశాయని చెప్పవచ్చు . అలాగే చాలా చాకచక్యంగా జనం ఫాలోయింగ్ సంపాదించుకున్న దీప్తి కూడా గ్రాండ్ ఫినాలేకి వెళ్లే ఛాన్స్ ఉందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు.