నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఈ విషయాలను గమనించారా?

హీరో నాని యాంకరింగ్ తో దుమ్మురేపుతూన్న బిగ్ బాస్ షో 100 రోజులకు చేరుకుంటున్న తరుణంలో హౌస్ మెంబర్స్ కుటుంబ సభ్యులను హౌస్ లోకి ప్రవేశ పెట్టి, సర్ఫరైజ్ ఇవ్వడం చూసాం. దీనివలన హౌస్ పట్ల ఆడియన్స్ కి ఆసక్తి కలిగేలా చేసారు. హౌస్ లోకి చివరిగా ప్రవేశించిన వ్యక్తి నందు. యితడు ఎవరో కాదు హౌస్ లో అందరికంటే తెలివిగా వ్యవహరిస్తున్న సింగర్ గీతామాధురి భర్త. గీతా , నందు కూడా ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన ముదుర్లే. అంతెందుకు నందుకు సీక్రెట్ గా ఏదో చెప్పాలని అనుకున్న గీతా మైక్ కట్టేసి, చెవిలో గుసగుసలాడింది. ముఖ్యంగా సామ్రాట్ విషయం మాట్లాడుకున్నారు. అయితే ఈ మాటలు ఎంత దాచాలనుకున్నా బట్టబయలు అయ్యాయనుకోండి.

ఇంకా కొన్ని పర్సనల్ విషయాలు చెవిలో చెప్పమని హింట్ ఇవ్వడంతో నందు అలానే చేసాడు. ఇక సామ్రాట్ తో వ్యవహారంలో తన తప్పేమి లేదని కవర్ చేసుకుంటూ గీత చెప్పడంతో నువ్వు ఏంటో నాకు తెలుసు అంటూ నందు చెప్పుకొచ్చాడు. ఇక మాట్లాడుకోవడం అయ్యాక డోర్ దగ్గరకి వెళ్ళాక కూడా గీతకు మళ్ళీ చెవిలో ఏవో విషయాలు నందు చెప్పాడు.

మొన్న సామ్రాట్ తల్లి, నిన్న తనీష్ తమ్ముడు, నేడు గీతా భర్త ఇలా ప్రతి రోజూ ఎవరు వచ్చినా కౌశల్ తో వివాదం లేకుండా ఉండాలనే ఏమో గానీ అందరూ సాఫ్ట్ గా వ్యవహరించారు. నేను ఇక్కడ కూర్చోవచ్చా లేదా అంటూ కౌశల్ తో నందు జోక్ చేస్తూ నవ్వులు పూయించాడు.

హెచ్చరికలా కాకుండా మీరంతా నా వైఫ్ ని జాగ్రత్తగా బాగా చూసుకోండి అంటూ చెప్పుకొస్తూ హౌస్ లోంచి నందు బయటకు వెళ్ళాడు. మొత్తానికి కౌశల్ తో గొడవ క్రియేట్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలనే ధోరణి అందరిలో కనిపించింది.