మొగుడు వర్సెస్ పెళ్ళాం .. ఇంతకీ ఎవరి మూవీ హిట్

సాధారణంగా అగ్ర హీరోల సినిమాలు ఒకే సీజన్ లో రిలీజవ్వడం, అవి ఫాన్స్ లో పోటీ పెంచడం చూస్తూనే ఉంటాం.. కానీ మొగుడు పెళ్ళాల సినిమాలు ఒకేసారి తెరమీదికి వస్తే, ఆ పోటీ మరీ రంజుగా ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. అక్కినేని వారసుడు నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు,నాగచైతన్య భార్య అక్కినేని సమంత నటించిన యు టర్న్ మూవీ లు ఒకే సీజన్ లో ఇంకా ఒకేరోజు వచ్చేసాయి. మరి ఏ రేంజ్ లో ఉన్నాయో ఏమిటో ఓ సారి చూద్దాం.పవన్ కుమార్ డైరెక్షన్ లో సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్ త‌దిత‌రులు నటించిన మూవీ యు టర్న్. ఇప్ప‌టికే ‘రంగ‌స్థ‌లం’, ‘మ‌హాన‌టి’, ‘అభిమ‌న్యుడు’ చిత్రాల‌తో విజ‌యాల్ని సొంతం చేసుకున్న స‌మంత‌ ఈ మూవీలో ఎలా చేసిందో చూద్దాం.

రచన (స‌మంత) వృత్తిరీత్యా ఓ జర్నలిస్ట్. శిక్ష‌ణ‌లో భాగంగా ఒక సంస్థలో ప్ర‌యాణం చేసే క్రమంలో ఆర్కే పురం ఫ్లై ఓవ‌ర్ యూ ట‌ర్న్ తీసుకొనే వాహ‌న‌దారుల్ని ఎంచుకుంటుంది. వాళ్ల వాహ‌నాల నంబ‌ర్ల ఆధారంగా చిరునామా, ఫోన్ నెంబ‌ర్లు తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. అందులో సుంద‌రం నెంబ‌రు చిరునామా ఒక‌టి.

అతని ఇంటర్వ్యూ కోసం ఇంటికి వెళుతుంది? తీరా అక్కడికి వెళ్లేస‌రికి సుంద‌రం చనిపోతాడు. దాంతో పోలీసులు ర‌చ‌ననే అనుమానిస్తూ విచార‌ణ‌కి పిలుస్తారు. అక్కడ షాకింగ్ నిజాలు తెలుస్తాయి. పైగా ఫ్లై ఓవ‌ర్ యూ ట‌ర్న్ తీసుకున్నవాళ్ళు మరణిస్తుంటారు. తెలుగు తెర‌కు సస్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ‌లు కొత్తేమీ కాదు. కానీ, వాటికి భిన్నంగా, ఓ కొత్త కోణాన్ని డైరెక్టర్ ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు. ఆది పినిశెట్టి పోలీసాఫీస‌ర్ నాయ‌క్‌గా మంచి నటన ప్ర‌దర్శించాడు.

రాహుల్ ర‌వీంద్ర‌న్ స‌మంత‌కి స్నేహితుడిగా, ఓ క్రైమ్ రిపోర్ట‌ర్‌గా క‌నిపిస్తాడు. క్లైమాక్స్ లో భూమిక నటన హృద‌యాల్ని హ‌త్తుకుంటుంది. స‌మంత అభిన‌యం, క‌థ, క‌థ‌నం, సాంకేతిక‌త‌ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అయితే, అక్క‌డ‌క్క‌డా వేగం త‌గ్గ‌డం, సినిమా సాగదీయడం, ప్రేక్ష‌కుడి ఊహకు అందే లా కధనం సాగడం మైనస్ పాయింట్స్ . వీకెండ్ లో ఖాళీగా ఉంటే ఈ మూవీ ఓ సారి చూడొచ్చు.

మారుతి రచన – దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్‌, న‌రేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, పృథ్వీరాజ్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు నటించిన ఫామిలీ ఎంటర్టైనర్ ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ. అత్తపాత్రలో అంటే శైలజారెడ్డిగా రమ్యకృష్ణ నటించడం విశేషం. ఇక ఈ మూవీ రివ్యూకి వస్తే, పొగరు బోతు అత్త పాత్రతో, ఇగో కేరెక్టర్స్ తో రూపొందించిన ఈ మూవీ కథలోకి వెళ్తే, చైతు (నాగ చైతన్య)అను (అను ఇమ్మాన్యుయెల్) అనే అమ్మాయిని ప్రేమిస్తే,అహంకారంతో ఉండే అనురెడ్డి మొదట్లో చైతూని ద్వేషించడం,ఆతర్వాత ఓ సమయంలో అతనితో ప్రేమలో పడడం జరుగుతాయి.
shailaja reddy alludu
ఇక అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆమె తల్లి శైలజారెడ్డి ఎంటర్ అవ్వడం, ఆమె పొగరుగా వ్యవహరిస్తే, చివరికి చైతు ఆమెకు బుద్ధి చెప్పడం షరా మామూలే. స్లిమ్ గా కనిపిస్తూ, పొగరుబోతు క్యేరెక్టర్స్ ని డీల్ చేసే నేర్పు గల పాత్రలో నాగ చైతన్య నటన సూపర్. పంతానికి పోయి కూతురితో కూడా మాట్లాడని పాత్రలో పొగరుబోతుగా రమ్యకృష్ణ నటన బాగుంది. ఇలాంటి పాతకథనే డైరెక్టర్ ఎంచుకున్నప్పటికీ,మారుతి మార్క్ కామెడీ నడిచింది. సెకండ్ ఆఫ్ లో కామెడీ స్కోప్ ఉన్నా డైరెక్టర్ ఎందుకో ఆ ఛాన్స్ వాడుకోలేకోయాడు.

కథ పరంగా ఏమాత్రం బలం లేకపోయినా సాంకేతికంగా , నిర్మాణం పరంగా జాగ్రత్తలు బానే తీసుకున్నారు. అయితే కథ.. కథనం రెండింట్లోనూ కొత్తదనం లేదు. కేవలం క్యారెక్టర్స్ చుట్టూనే సినిమా కథ అల్లే ప్రయత్నం చేయడం మైనస్ పాయింట్. స్టోరీ విషయంలో కసరత్తు చేస్తే బాగుండేది. పృథ్వీరాజ్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్, ముర‌ళీశ‌ర్మ‌ బాగా నవ్వించారు. ముఖ్యంగా మాణిక్యం క్యారక్టర్ నవ్వులు పూయించింది. అయితే సరదాగా ఫామిలీ అందరూ వెళ్లి ఈ మూవీ చూడొచ్చు. ఇక ఈరెండు చిత్రాలకు సమీక్షలు 2/5 చొప్పున,3/5 చొప్పున రేటింగ్ ఇస్తున్నారు. అయితే ఆడియన్స్ ఏ రేటింగ్ ఇచ్చి ఏ మూవీని నిలబెడతారో చూడాలి.