కౌశల్ ఆర్మీని నడిపించేది కౌశల్ భార్య నీలిమ… ఇందులో నిజం ఎంత?

బుల్లితెరపై జోరుగా సాగుతూ త్వరలోనే ముగియబోతున్న బిగ్ బాస్ సీజన్ 2 రియాల్టీ షోలో కౌశల్ క్రేజ్ ఎవరు ఊహించనంత స్థాయికి చేరింది. కౌశల్ ని హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ టార్గెట్ చేయడమే అభిమానులు కౌశల్ ఆర్మీ గా ఏర్పడడానికి దారితీసింది. అలా ఆవిర్భవించిన కౌశల్ ఆర్మీ కౌశల్ కి పాపులారిటీ తీసుకురావడమే కాదు,సోషల్ మీడియాలో దూసుకుపోతూ బిగ్ బాస్ ని శాసించే స్థాయికి చేరింది. అయితే ఇది గమనించకుండా కౌశల్ ని ఇంకా ఆడిపోసుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ చివరకు అతని భార్యపై కూడా కామెంట్స్ విసరడం నెటిజన్లకు ఆగ్రహం రప్పించింది. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు,ఒక మహిళపై ఇలా వ్యాఖ్యలు చేయకూడదన్న విషయం తెలీదా అంటూ మండిపడుతున్నారు.

ఇక కౌశల్ భార్య నీలిమ గురించి, ఆమె భర్తకు అందిస్తున్న ప్రోత్సాహం గురించి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం శోచనీయమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అసలు కంటెస్టెంట్స్ కి, ఎలిమినేషన్ అయి వెళ్ళిపోయినా కూడా విమర్శలు గుప్పిస్తున్న వారికి కౌశల్ ని ఇంకా ఏదో చేసేద్దామన్న దుగ్ద కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

హౌస్ లో కౌశల్ కి కాల్ చేసినప్పుడు గానీ, మొన్న హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు గానీ నీలిమ ఎంతో హుందాగా మాట్లాడిన తీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుందని అంటున్నారు. కౌశల్ కి ఏది అవసరమో ఆ విషయాలే మాట్లాడుతూ బయట విషయాల గురించి వివరిస్తూ, సూచనలు చేయడం గమనించలేదా అని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

కౌశల్ ఆర్మీని ముందే ఏర్పాటుచేసుకుని దాన్ని నిర్వహించే బాధ్యత ఆవిడకు అప్పగించి మరీ హౌస్ లోకి వచ్చాడని, కౌశల్ ని, అతని భార్యని ఉద్దేశించి కొందరు కంటెస్టెంట్స్ వ్యాఖ్యానించడం శోచనీయమని అభిమానులు మండిపడుతున్నారు. కౌశల్ భార్య ఎప్పుడూ మీడియాలో మాట్లాడిన దాఖలాలు లేవని, ఒకసారి కౌశల్ ని ఓ మీడియా సంస్థ ఇంటర్యూ చేసినపుడు పక్కనే ఉన్నా సరే,నీలిమ మాట్లాడింది తక్కువేనని గుర్తుచేస్తున్నారు.

ఇక హౌస్ లోకి వచ్చాక ఆమెను చూస్తే, ఎంతో బిడియ పడుతూ కనిపించారని అలాంటి ఆమె ఓ ఆర్మీ పేరిట ఇంతపెద్ద గ్రూప్ ని ఎలా నిర్వహిస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అభిమానులు తమంత తాముగా కౌశల్ కోసం ఆర్మీ గ్రూప్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న విషయాన్ని తట్టుకోలేక కౌశల్ ని, అతని భార్యను నానా మాటలను అనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన ఓ పెద్దాయన చేస్తున్న విమర్శలు మరీ దారుణంగా ఉన్నాయని అభిమానులు మండిపడుతున్నారు. కౌశల్ భార్య ఎలా భరిస్తోందో, ఆమెకు దండం పెట్టాలి అంటూ కౌశల్ ని ఆడిపోసుకోవడం ద్వారా అతని భార్యపై వ్యాఖ్యలు చేసిన గీత మాధురి,దీప్తి లాంటి వాళ్ళను ఏమనాలి అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

మిగతావాళ్ళు వాళ్ళ కుటుంబాలతో ఎలా వుంటారో గానీ,ఎన్ని దండాలు పెడతారో గానీ కౌశల్ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని,తామంతా తలెత్తుకుని గౌరవంగా ఓ గొప్ప మూవీ మెంట్ ని కౌశల్ ద్వారా పొందామంటూ కోట్లాది మంది అభిమానులు చూస్తుండగా హౌస్ లో నీలిమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఆమె చెప్పడం గీతా మాధురి , దీప్తిలకు చెంప చెళ్లుమనిపించడమే కదా. ఇప్పటికైనా వాళ్లలో మార్పు వస్తుందో లేదో చూద్దాం అంటూ కొందరు అభిమానులు వ్యాఖ్యానించారు.