నేలకొరిగిన మరో టాలీవుడ్ దిగ్గజం…షాక్ లో సినీ ఇండస్ట్రీ

ఈమధ్య కాలంలో దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు మొదలుకుని నిన్నటి హరికృష , ఆతర్వాత దర్శకురాలు జయ వరకూ ఎందరో ప్రముఖులు తనువుచాలించారు. ఇలా ప్రముఖులను కోల్పోతూ, సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోతోంది. డాక్టర్ దాసరి, అందాల తార శ్రీదేవి,హరికష్ణ, డైరెక్టర్ జయ,తాజాగా టాలీవుడు దర్శక దిగ్గజం మరణం అందరిని కలచివేస్తోంది. ఇటీవల హరికృష్ణ దుర్మరణం,డైరెక్టర్ జయ ఆకస్మిక మరణాన్ని జీరించుకోలేకపోతున్న తెలుగు ఇండస్ట్రీని మరో విషాదం ఇప్పుడు చుట్టుముట్టింది.

సందేశాత్మక చిత్రాలతో తనకంటూ ఓ ముద్ర వేసిన దర్శకుడు, సినీ క్రిటిక్ కె ఎన్ టి శాస్త్రి కన్నుమూశారు. 1945సెప్టెంబర్ 5న కర్ణాటక లో జన్మించిన శాస్త్రి కి భార్య , ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి,ఎన్నో పత్రికల్లో పనిచేసారు. సినీ రచయితగా,విమర్శకునిగా, పుస్తక రచయితగా,ప్రచురణ కర్తగా, డాక్యుమెంటరీ సినీ నిర్మాతగా, దర్శకుడుగా పేరుపొందారు. ప్రముఖ నాటక సంస్థ సురభితో దృశ్య మాధ్యమంలోకి అడుగుపెట్టారు.

తెలంగాణాలో అమ్మాయిల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ‘హార్వెస్టింగ్ బేబీ గర్ల్స్’ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ లో ఆడియన్స్ అవార్డు దక్కించుకుంది. శాస్త్రి వివిధ విభాగాల్లో 12అంతర్జాతీయ,7జాతీయ పురస్కారాలు పొందారు. తిలాదానం, సురభి,కమ్లి, షాదు తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. తిలాదానం,సురభి మూవీస్ కి జాతీయ అవార్డులతో పాటు నంది పురస్కారం కూడా వరించింది. కొన్ని కన్నడ చిత్రాలకు కూడా పనిచేసారు. దర్శకునిగా కాకుండా సినీ విమర్శకునిగా పేరు పొందారు. పలు చిత్రాలకు జ్యురి సభ్యునిగా వున్నారు.

2006లో నందితా దాస్ హీరోయిన్ గా వచ్చిన కమ్లి చిత్రాన్ని దక్షిణ కొరియాలో ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు నోచుకుంది. అంతేకాదు 7అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. అంతేకాదు 45ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శన జరుపుకుని రికార్డు సృష్టించింది. పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు గల శాస్త్రి, ‘కమర్షియల్ చిత్రాలు అందరూ తీస్తారు , కానీ నేను సినిమా తీస్తే అందులో సందేశం ఉండాలి’అని సగర్వంగా చెప్పేవారు. చివరివరకూ అలానే వున్నారు. ఇక ఈయన రాసిన అలనాటి చలనచిత్రం పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది.