రోబో 2.0 టీజర్ ని చూసి మండిపడుతున్న బాలీవుడ్…. ఎందుకో చూడండి

రజనీకాంత్ పేరుచెబితే చాలు తమిళనాట అభిమాన జనం ఉర్రూతలూగిపోతారు. అతడి కోసం ఏమి చేయడానికైనా వెనుకాడని లక్షలాది అభిమానులున్నారు. అంతేకాదు దక్షిణాదిన, అలాగే ఉత్తరాదిన కూడా ఈయనకు అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద కోట్లమంది అభిమానులున్నారు. ఇక రజనీ సినిమా వస్తోందంటే ఆ సందడే వేరు. తాజాగా రోబోకి సీక్వెల్ గా మూడు భాషల్లో లైకా ప్రొడక్షన్స్ లో రోబో 2.0 రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల అవ్వడంతో 11మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక టీజర్ ఇలా ఉంటే,సినిమా ఎలా ఉంటుందో మీరే అర్ధం చేసుకోండి.

ఎన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.ఇక ఈ మూవీలో సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్, అలాగే హాలీవుడ్ రేంజ్ లో ఊహించాల్సిన ఎన్నో విషయాలున్నాయి. రజనీకాంత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో బాలీవుడ్ లో అక్షయ కుమార్ కి కూడా అంతే ఫాలోయింగ్ వుంది. అయితే ఈ మూవీలో వీరిద్దరూ పోటీ పడుతున్నారు.

అయితే ఈ టీజర్ ఇలా విడుదలైందో అనూహ్యంగా వైరల్ అవుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే అదే రేంజ్ లో బాలివుడ్ ఆడియన్స్ విమర్శలతో’అసలు ఇదే టీజర్’అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం ఇప్పుడు మరో సంచలనం అయింది.దర్శక దిగ్గజం శంకర్,సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్, రజనీ, అక్షయ్ ఇలా మంచి కాంబినేషన్ గల ఈ మూవీ టీజర్ లో కొత్తదనం ఏముందని బాలీవుడ్ జనాలు ప్రశ్నిస్తూ ఏకిపారేస్తున్నారు.

నిజానికి హిందీలో కూడా టీజర్ విడుదల చేశారు. అయితే కాగడా పెట్టి వెతికినా ఎక్కడా అక్షయ్ కనపడ్డం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదో కనిపించీ కనిపించనట్టు ఉండడంతో అక్షయ్ ని ఇలా చూపిస్తారా అంటూ షోషల్ మీడియాలో కామెంట్స్ తో ఉతికి ఆరేస్తున్నారు.

మార్కెట్ పడిపోతుందని,అందుచేత అక్షయ్ ని ఎక్కువగా చూపిస్తూ,పూర్తిగా బాలీవుడ్ వెర్షన్ లో ఉండేలా,మరో టీజర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే మార్కెట్ బాగుంటుందని అంటున్నారు.