వాయిదా పడుతూ వస్తున్న ఎలిమినేషన్ …. ఎట్టకేలకు ఎలిమినేట్ అయినా అమిత్

హీరో నాని యాంకరింగ్ తో బుల్లితెరపై సందడి చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 98ఎపిసోడ్స్ పూర్తిచేసుకుని చివరి దశకు చేరుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా గీతా మాధురి, దీప్తి నల్లమోతు,రోల్ రైడా, అమిత్,నామినేట్ కాగా కౌశల్ సీజన్ అంతా నామినేషన్ లో ఉన్న సంగతి తెల్సిందే. ఈ ఐదుగురిలో అమిత్ ఈ వారం బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. కౌశల్ , దీప్తిలకు అతధిక ఓటింగ్ నమోదవ్వగా, ఆతర్వాత స్థానంలో గీతా మాధురి,తర్వాత రోల్, అమిత్ లు వున్నారు.ఫలితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి అమిత్ అవుట్ అయినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే అమిత్ ఆటతీరు ఇష్టపడేవారు తక్కువమంది వున్నారు. ఇక అతనికి క్రేజ్ కూడా లేదు. అయితే నామినేషన్ దాకా రాకపోవడం వల్లనే ఇంతకాలం హౌస్ లో కొనసాగాడన్న మాట వినిపిస్తోంది.

అయితే గత రెండు వారాలుగా ఎలిమినేషన్ కి నామినేట్ అవుతున్న అమిత్ తృటిలో ఎలిమినేషన్ తప్పించుఇకుంటూ వస్తున్నా అమిత్ చివరకు ఈ వారం హౌస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.