గీతా మాధురి,కౌశల్ కి గట్టిగా క్లాస్ పీకిన నాని

బుల్లితెరపై దూసుకుపోతున్న బిగ్ బాస్ 2రియాల్టీ షో చివరి దశకు చేరడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. కంటెస్టెంట్స్ మధ్య పోటీ కూడా తారా స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో ఈ వారాంతంలో 98వ ఎపిసోడ్ ని హోస్ట్ నాని తనదైన శైలిలో ప్రారంభించాడు. ఈ సందర్బంగా గీతా మాధురి కి, కౌశల్ కి కూడా క్లాస్ పీకాడు నాని. ప్రతి ఓటు కూడా కీలకమని,మీ అభిమాన కంటెస్టెంట్ కి నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏమీ కాదని అనుకోకండి, తమ తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేయాలని సూచించాడు. కాగా హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో కౌశల్ సంచాలకునిగా రాణించలేకపోయాడని కంటెస్టెంట్స్ అన్నారు.

మనలో ఒకరికి ఇమ్యూనిటీ వస్తే కౌశల్ తట్టుకోలేదని తనీష్ అనేశాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఇక హౌస్ లోనే కాదు బయట కూడా మంచిగా అనిపించుకోవాలని చెప్పుకొచ్చారు. ఇక గత ఎపిసోడ్ లో దీప్తి, సామ్రాట్ లతో గీతా మాధురి మాట్లాడుతూ కౌశల్ ఆర్మీ పెయిడ్ టీమ్ అంటూ వ్యాఖ్యానించడం పై బయట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇదే విషయాన్ని నాని ప్రస్తావిస్తూ సీరియస్ అయ్యాడు. ‘తోటి కంటెస్టెంట్ గురించి అలా మాట్లాడొచ్చా, అసలు కౌశల్ ఆర్మీ పెయిడ్ అని ఎలా చెబుతారు? నీ దగ్గర ఏ ఆధారాలున్నాయి. కౌశల్ ఆర్మీ పెయిడ్ అయితే అతడు ఆడే గేమ్ కి విలువలేదా? అయినా నీవు గేమ్ ఇంట్రెస్టింగా ఆడడం లేదు. ఇన్నాళ్లూ నీవు సంపాదించుకున్న పేరు ఒక్క మాటతో పోయింది.

ఈ ఘటనతో నీ చుట్టూ ఉన్న కంటెస్టెంట్స్ కూడా చెడుగా ఆడేలా చేస్తున్నట్టు ఉంది”అంటూ నాని ఓ రేంజ్ లో గీతాలకు క్లాస్ ఇచ్చుకున్నాడు
కాగా రోల్,కౌశల్ ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణలో రోల్ పై కౌశల్ అసభ్యంగా మాట్లాడ్డం గురించి నాని ప్రస్తావిస్తూ అసలేం జరిగింది అని నిలదీసాడు. ఏదైనా అక్కడికక్కడే అడిగే దమ్ము నీకుందా అని రోల్ ని అడిగాడు.

కౌశల్ అసభ్యంగా మాట్లాడడంతో చాలా బాధ కలిగిందన్నాడు. కౌశల్ కూడా అలా అన్నట్టు ఒప్పుకోవడంతో నాని మండిపడ్డాడు. అయితే తన పిల్లలను దృష్టిలో పెట్టుకుని అన్నానని,దీనికి సారీ కూడా చెబుతున్నానని కౌశల్ చెప్పాడు. ఈవారం కెప్టెన్సీ టాస్క్,సంచాలకుడుగా గానీ కీలకం అని నాని అంటూ ఎవరూ సరిగ్గా చేయలేదని నాని అన్నాడు.

టాస్క్ పేపర్ ని నాని చదివి వినిపిస్తూ సంచలకునిగా నాని విఫలమయ్యాడని చెప్పాడు. ఇక సామ్రాట్ కి ఓ కాల్ వచ్చింది. ‘మీరు బాగా ఆడుతున్నారు . మీరు టైటిల్ గెలవాలి ‘అంటూ ఆ వ్యక్తి చెప్పాడు. హౌస్ లోకి కుటుంబ సభ్యులు రావడంపై థ్రిల్ ఎలా ఉందని నాని అడగ్గా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పారు. అయితే నందు ఏదో చెవిలో చెప్పాడు కదా అది ఏమిటని నాని అడగ్గా గీతా సమాధానం చెప్పలేదు. ఇక సేఫ్ జోన్ లో ఎవరున్నారో చెప్పకుండా తర్వాత ఎపిసోడ్ కి వాయిదా వేసాడు నాని.