బిగ్ బాస్ ఎనాలసిస్ దీప్తి ఓటింగ్ ఫేకా…..అసలు ఇదంతా నిజమేనా?

బిగ్ బాస్ సీజన్ 2 చివరి అంకం నడుస్తుంది. దీంతో కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరింతగా పెరిగింది. బయట నుంచి సపోర్ట్ కూడా ఆయా కంటెస్టెంట్స్ కి అనుకూలంగా మారుతోంది. దీంతో ఒక్కసారిగా కొంతమందికి ఓటింగ్ హెచ్చుతోంది. ముఖ్యంగా దీప్తి నల్లమోతుకి భారీ ఓటింగ్ జరుగుతుండడంపై కంటెస్టెంట్స్ లోనూ, వాళ్ళ అభిమానుల్లోనే ఆందోళన పెరుగుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు,విశ్లేషకులు కూడా వివరణలు ఇస్తున్నారు. ముఖ్యంగా 14వ వారం దీప్తికి ఓటింగ్ భారీగా రావడమే ఇందుకు కారణం. ఓ ఐటి కంపెనీ నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఓటింగ్ జరగడమే ఇలా ఓటింగ్ పెరగడానికి కారణమని అంటున్నారు.

అయితే ఏది పెయిడ్ ఓటింగ్,ఏది జెన్యూన్ ఓటింగ్ అనేది ఆడియన్స్ కి బాగా అర్ధం అవుతుంది. అభిమానంగా ఓట్లు వేస్తే, అది జెన్యూన్ కిందే లెక్క. ఎవరి అభిమానులు వారికి ఓట్లు వేసుకోవడం కూడా తప్పుకాదు. ఉదాహరణకు ఓ కంపెనీలో 3వేలమంది,మరో కంపెనీలో 4వేలమంది ఎంప్లాయిస్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒకరికే ఓటు వేయడం జరగొచ్చు.

అంతమాత్రం చేత అది తప్పు అవ్వదు. ఎందుకంటే, గత సీజన్ లో కూడా శివ బాలాజీ కి కొందరు సపోర్ట్ చేసారు. అలాగే ఆదర్శ్ కి కొన్ని కంపెనీలు బాగానే సపోర్ట్ చేయడం కూడా చూసాం. అంతేకాదు ఓట్ ఫర్ హరితేజ అంటూ ప్రచారం కూడా చేయడం జరిగింది.ఇప్పుడు కూడా కౌశల్ కి కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేయడం,2కె రన్ లాంటివి చేయడం కూడా చూసాం.

అయితే ఒక్కసారిగా దీప్తికి ఓటింగ్ పెరగడం ఇప్పుడు కనిపించిందే తప్ప, మొదటి నుంచీ లేదు. పైగా ఎలిమినేషన్ నుంచి దీప్తి తృటిలో తప్పించుకుంటూ రావడం కూడా చూసాం. ఆడియన్స్ లో ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని వారి వారి ఫెరఫార్మెన్స్ ని బట్టి ఇష్టపడేవారుంటారు. అందుచేత ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి ఓట్లు వేయవచ్చు.

ఇది సహజం. ఒకవేళ పెయిడ్ ఓటింగ్ అయితే అది తెలిసిపోతుంది. ఇలా గుర్తించడానికి బిగ్ బాస్ టీమ్ పరిశీలన కూడా చేస్తోంది. ఏది ఏమైనా ఒక కంపెనీ మొత్తం సపోర్ట్ చేసినంత మాత్రాన ఓటింగ్ శాతం భారీగా పెరగడం అన్నది జరగదని కూడా తెలుసుకోవాలి. బిగ్ బాస్ ముగిసేలోగా ఇలాంటి ఆందోళనలు, అనుమానాలు ఇంకా పెరిగిపోవడం కూడా సహజమే. ఇంకా ఇలాంటివెన్ని వస్తాయో చూడాలి.