దీప్తి ని ఎదుర్కోవడానికి కౌశల్ ఆర్మీ ఏ విధమైన అస్రాన్ని ఉపయోగిస్తుంది

పెరిగిపోతుంది . హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తునడం తో ఎవరు ఫినాలే లో అడుగుపెడతారో , ఎవరు ఇంటి నుండి బయటకి వస్తారో చెప్పలేకున్నారు . ఫినాలే కి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటం తో ఈ వేడి మరింతగా పెరిగిపోయింది .
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కౌశల్ , గీత , అమిత్ , దీప్తి , రోల్ ఉన్నారు . వీరు కాకహౌస్ లో ఇంకా తనీష్ , సామ్రాట్ లు కొనసాగుతున్నారు . ఈ వారం ఓటింగ్ ని బట్టి చూస్తే అమిత్ , రోల్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు . ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటె మాత్రం రోల్,అమిత్ ఇద్దరు కూడా తమ లగేజి ని సర్దుకోవాల్సిందే .

ఇక పొతే ఈ వారం సింగల్ ఎలిమినేషన్ ఉంటె హౌస్ లో మొత్తం ఇంకా 6 మంది సభ్యులు ఉంటారు . కానీ ఫినాలే కి మొదటి సీజన్ లా 5 మంది ని ,కాకుండా ముగ్గురిని సెలెక్ట్ చేస్తారని బిగ్ బాస్ నిర్వాహకులనుండి వార్తలు వినిపిస్తున్నాయి . దీనితో ఇప్పుడు కొంతమేర కౌశల్ ఆర్మీ టెంక్షన్ పడుతున్నట్టు కనిపిస్తుంది .

ఎందుకు అంటే ఫినాలే కి ముగ్గురిని సెలెక్ట్ చేస్తే పోటీ మరింత తీవ్రతరం అవుతుంది . ముఖ్యంగా కౌశల్ కి దీప్తి తో ప్రమాదం పొంచి ఉందని కౌశల్ ఆర్మీ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు . ఎంతవరకు ఎవరొకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి దీప్తి ని సపోర్ట్ చేస్తూ వస్తున్న కౌశల్ ఆర్మీ కి దిమ్మతిరిగే విధంగా ఇప్పుడు దీప్తి కి ఓటింగ్ జరుగుతుంది .

దీప్తి ఓటింగ్ ని చూసిన కౌశల్ ఆర్మీ సభ్యులు కొంచెం ఆలోచనలో పడ్డారు . కౌశల్ ఎలాగూ ఫినాలే లో ఉంటాడు కాబట్టి మిగిలిన గీత , తనీష్ , సామ్రాట్ , దీప్తి లలో మరో ఇద్దరు కూడా ఫినాలే లో అడుగు పెడతారు . ఒకవేళ ఫినాలే లో దీప్తి చోటు పొందలేకపోతే కౌశల్ కి మరింత లాభం చేకూరనుంది . దీప్తి అభిమానులు కూడా కౌశల్ కే సపోర్ట్ చేసే అవకాశం ఉంది .

కానీ ఆలా కాకుండా దీప్తి కూడా ఫినాలే లిస్ట్ లో ఉంటె మాత్రం కౌశల్ ఓటింగ్ లో కొంచెం మార్పు జరిగే అవకాశం ఉంది అని అంచనాలు వేస్తున్నారు . కౌశల్ ని టైటిల్ విన్నర్ కాకుండా దీప్తి చేయలేదు కానీ, కౌశల్ కి వచ్చే ఓట్ల పై ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది .
అలాగే దీప్తి భర్త హౌస్ లోకి వచ్చి , కౌశల్ తో కొంచెం నవ్వుతు మాట్లాడు , అందరితోనూ ఒకేలా ఉండు అంటూ కొన్ని విలువైన సలహాలు ఇచ్చాడు .

ఈ సలహాలని దీప్తి చాలా కరెక్ట్ గా అర్థం చేసుకొని గత రెండు రోజులుగా తన గేమ్ ప్లాన్ ని మొత్తం మార్చేసింది . చూడాలి మరి దీప్తి ని ఎదుర్కోవడానికి కౌశల్ ఆర్మీ ఏ విధమైన అస్త్రం తో మన ముందుకు వస్తుందో …