నానికి కౌశల్ ఆర్మీ 7 దిమ్మతిరిగే ప్రశ్నలు

బిగ్ బాస్ హోస్ట్ నానిపై ఇప్పటికే ఓసారి విమర్శలు గుప్పించడం దానికి సమాధానం ఇస్తూ నాని ట్వీట్ చేయడం జరిగిపోయాయి. అయితే తాజాగా మరోసారి కౌశల్ ఆర్మీ నానిపై భగ్గుమంది. బిగ్ బాస్ సీజన్ 2మొదలై 3మాసాలు దాటిపోయి, ఇక ముగింపు దశకు చేరింది. అయితే కౌశల్ మాత్రం ఇప్పటికీ గ్రూపులు కట్టకుండా, హౌస్ లో ఒంటరిగానే వున్నాడు. గేమ్ మీద ద్రుస్తిపెట్టి మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న కౌశల్ ని అందరూ టార్గెట్ చేసినా సరే, తన పంధాలో వెళుతున్నాడు. అందుకే బయట లక్షల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు.

అయితే ఈ మధ్య రోల్ రైడాను ఏదో అన్నాడని కౌశల్ కి నాని క్లాస్ పీకాడు. తాను ఏదో బాధలో ఉండి అలా అన్నానని ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే, నాని వదలకుండా దుమ్ము దులిపేసాడు. ఇలా ఒకసారి తిట్టినందుకే రచ్చ రచ్చ చేయడం కౌశల్ ఆర్మీ జీరించుకోలేకపోతోంది.ఇక హౌస్ లో పాత విషయాలను కౌశల్ ఆర్మీ గుర్తుచేస్తూ, కౌశల్ ఆహారపు అలవాట్లను తేజస్వి ప్రస్తావిస్తూ ‘సిగ్గులేకుండా తిన్నారని’ఆక్షేపించింది.

నిజానికి అందరూ తిన్నాక తాను తినడం కౌశల్ నైజం. దాన్ని బేస్ చేసుకుని, తేజస్వి నోరు పారేసుకుంది. ఇక మరో సందర్భంలో తాను మహిళ అనే ఇంగితం లేకుండా వాడి కిందవి రెండు పీకుతా అంటే ఎవరూ నోరుమెదపలేదు అని కౌశల్ ఆర్మీ గుర్తిచేసింది. ఇక నందిని కూడా నామినేట్ చేస్తే ఏంటి వాడో వెధవ అనేసింది.

ఇక గణేష్ అయితే ఈ బ్లాంకెట్స్ ఎవరు మార్చారని అడుగుతూనే ఎవరికీ వినపడకుండా నీ యమ్మ మొగుడు అంటూ నోరుపారేసుకున్నాడు కౌశల్ మీద. అయితే గణేష్ మాటలు నాని మైక్రో ఫోన్ కి దొరికిపోయాయి. ఇక దీప్తి సునయన అయితే ఎం పీకుతున్నావ్ అంటూ కఠినంగా మాట్లాడ్డం ఆడియన్స్ కి ఇంకా గుర్తుండే ఉంటుంది.

ఇక అమిత్ కూడా ఇక్కడ కనుక ఊరుకున్నా బయట అయితే కొట్టేవాణ్ణి అంటూ దూషించినవాడే. ఇలా చాలానే ఉన్నాయి. కొన్ని అన్ సీన్ కింద ఉండిపోవడంతో బయటకు రాలేదు. ఇవన్నీ కౌశల్ ని బాధించినా ఏనాడూ నానికి కౌశల్ పిర్యాదు చేయలేదు.

అయితే ఏదో మూడ్ లో ఉండడం వలన ఓ మాట తూలితే అదేదో కౌశల్ చేసిన పెద్ద తప్పుగా నాని క్లాస్ పీకడం ఆడియన్స్ లో సహజమగానే అసహనం కల్గించింది. గతంలో కౌశల్ పై వ్యాఖ్యలు చేసినవారి విషయంలో నాని ఏమి మాట్లాడకుండా ఇప్పుడు నానిపై మండిపడడం చూస్తుంటే, ఇతరులకు ఓ న్యాయం, నానికి ఇంకో న్యాయమా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తాను ఎవరి పక్షపాతిని కానని చెప్పే నాని ఇప్పుడు కౌశల్ పట్ల వ్యవహరించిన తీరుని ఏమంటారో సెలవివ్వాలని కౌశల్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది.