విజయవాడలో జరిగిన కౌశల్ ఆర్మీ 2k రన్ పై నాని షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ టులో ఇప్పటికీ ఒంటరిగా పోరాడుతూ బయట లక్షలాది మంది జనంలో గూడు కట్టుకున్న కౌశల్ కోసం అభిమానులు చేయని కార్యక్రమం అంటూ లేదు. కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో దూసుకుపోతూ ,సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కౌశల్ పేరు మారుమోగిపోతోంది. హైదరాబాద్ లో 2కె రన్ నిర్వహించిన అభిమానులు తాజాగా విజయవాడలో కూడా 2కె రన్ తలపెట్టారు. ఈ విషయం తెల్సిన నాని మాట్లాడుతూ కౌశల్ కోసం,ఇంతమంది ఇలా ఊరూ వాడా కౌశల్ ఆర్మీ ప్రభంజనం సృష్టించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోందని అన్నారు.
Vijayawada kaushal army 2 k run
సినీ ఇండస్ట్రీలో ఇన్నాళ్ల నుంచి చూస్తున్నాను ఏ స్టార్ హీరోకి ఇంతటి ఫాలోయింగ్ లేదు. ఇలా ర్యాలీలు నిర్వహించడం ఇప్పటివరకూ చూడలేదు. ప్రతి హీరోకి , హీరోయిన్ కి ఫాన్స్ ఉండడం సహజం. వాగారికోసం ఏమైనా చేయడానికి అందులో కొందరు మాత్రమే ముందుకు వస్తారు.

కానీ బిగ్ బాస్ షో లో ఓ కంటెస్టెంట్ కోసం ఇలా ర్యాలీలు నిర్వహించడం,ప్రతి ఒక్కరు కౌశల్ కౌశల్ అంటూ నినదించడం చూస్తుంటే ఇలాంటి ప్రభంజనం చరిత్రలో ఎక్కడా చూడలేను అనిపిస్తోంది. హౌస్ లో ఏమి జరిగినా స్పందిస్తున్నారు. కౌశల్ అభిమానులు ఇలాగే ఉంటూ మంచి పనులకు సాయపడాలి”అని నాని పేర్కొన్నారు.