సైరా సినిమాలో మెగా డాటర్ పాత్ర…ప్రాముఖ్యం ఉన్న పాత్రా…???

మెగాస్టార్ స్వశక్తితో ఎదిగితే, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఎందరో నటులు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఇంకా వస్తున్నారు కూడా. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హీరోలే కాకుండా హీరోయిన్ కూడా రంగ ప్రవేశం చేసి ,తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది. నాగబాబు డాటర్ అయిన నిహారిక తన నటనతో అభిమానుల మనసు గెలుచుకుంటోంది.

యాక్టింగ్ , టాలెంట్ విషయంలో విమర్శలు లేకుండా జాగ్రత్తపడ్తున్న నిహారిక పాత్రల ఎంపికలో కూడా తగు శ్రద్ధ చూపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటించి, ఓ తమిళ మూవీలో కూడా నటించిన నిహారిక తాజాగా, చిరంజీవి నటిస్తున్న, సైరాలో కూడా కనిపించబోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధను ఆవిష్కరిస్తూ రామ్ చరణ్ అంత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న చాత్రాత్మక సైరా మూవీలో ఓ చిన్న పాత్రలో నటిస్తోందట.

కేవలం 10నిమిషాలే కనిపించే పాత్రే అయినా, పాత్రపరంగా ఎంతోగుర్తింపు ఉంటుందని గట్టి నమ్మకంగా ఉందట నిహారిక.అందుకు సంబంధిచిన వార్తలు కూడా బయటకు పొక్కాయి. ఓ కథాకళి డాన్సర్ పాత్రలో నిహారిక అలరించబోతోందట. కనిపించేది చిన్న పాత్రే అయినా కథలో మాత్రం చాలా ప్రాముఖ్యం గల పాత్రకావడంతో కథాకళిలో శిక్షణ పొందుతోందట.

ఎందుకంటే ఈ మూవీలో తన పాత్ర ప్రేక్షకాదరణ చూరగొంటే, మంచి బ్రేక్ అవుతుందని భావిస్తోందట. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలచేయబోతే ఈ చిత్రం ద్వారా నిహారికకు మంచి గుర్తింపు రావడం ఖాయమని అంటున్నారు.