భారీ హైప్ తో NTR బయో పిక్ ఎంత బిజినెస్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఎన్టీఆర్ ఈ పేరు చెబితే తెలుగునాట తెలియని వారుండరు. నటుడిగా విశ్వరూపం చూపించి,రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కిస్తూ ఎన్టీఆర్ బయోపిక్ ని నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ కి అప్పుడే ప్రమోషన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. ఒక్కో పోస్టర్ ని విడుదల చేస్తూ సందడి చేస్తోంది చిత్ర యూనిట్. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ వైపు వెళుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతుంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి 20 కోట్ల బిజినెస్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

నిజానికి బాలకృష్ణ సినిమా ఏదీ కూడా 20 కోట్లకు చేరలేదు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కోసం అంతసొమ్ము వెచ్చిస్తే తిరిగి రాబడుతుందా అనేది ప్రసార్ధకమే. కానీ ప్రీ రిలీజ్ ప్రచారం భారీగా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ తో బాలయ్య సరికొత్త రికార్డు సృష్టిస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అసెంబ్లీలో జరుపుకుంటోంది. ఇక ప్రమోషన్ లో భాగంగా విధుల చేస్తున్న పోస్టర్లలో

తాజాగా ఎన్టీఆర్ గా బాలయ్య,చంద్రబాబుగా రానా నటిస్తున్న స్టిల్ ఉంది.వినాయక చవితి సందర్బంగా ఎన్టీఆర్, చంద్రబాబులకు సంబంధించిన స్టిల్ అందరి నీ విశేషంగా అలరిస్తోంది. ఇక ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. షూటింగ్ దశలోనే ప్రమోషన్ వర్క్ కూడా పూర్తిచేసేస్తున్న ఎన్టీఆర్ మూవీని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.