ఈ రోజు హౌస్ నుండి బయటకు వెళ్ళేది రోల్ రైడా… మరొకరు ఎవరో?

బిగ్ బాస్ సీజన్ టు మంచి రసవత్తరంగా కొనసాగుతోంది. మరో కొద్దిరోజుల్లో ముగియబోతున్న బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ పోటీగా ఆడేస్తున్నారు. ఇక గతవారం శ్యామల ఎలిమినేట్ అయిన సంగతి తెల్సిందే. అప్పుడు సింగిల్ ఎలిమినేషన్ వలన ఆమె ఒక్కర్తే బయటకు వచ్చింది. కానీ ఈవారం పక్కాగా డబుల్ ఎలిమినేషన్ అని తేలిపోయింది. కౌశల్, గీతా మాధురి, దీప్తి,అమిత్, రోల్ రైడా లు ఎలిమినేషన్ కి మిగిలి వున్నారు. నిజానికి గత రెండు వారాలను పరిశీలిస్తే, అమిత్ బయటకు వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఓ వారం నూతన్ నాయుడు, మరోవారం శ్యామల వచ్చేసారు.

అమిత్ ఎందుకు హౌస్ లో ఉండిపోయాడో అనే విషయమై వివరాలు అందకపోయినా ఈవారం ఇద్దరు బయటకు వెళ్లడం ఖాయమని తేలిపోవడంతో కౌశల్ , గీతా మాధురి మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో వారి వారి అభిమానులు వీరలెవెల్లో ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. అందుచేత వాళ్లిద్దరూ ఎలిమినేషన్ ఛాన్స్ నుంచి బయట పడి హౌస్ లో ఉండడం పక్కా అని చెప్పవచ్చు.

ఇక దీప్తి నల్లమోతు ని తీసుకుంటే మగ కంటెస్టెంట్స్ కి ధీటుగా పోటీపడుతున్నందున సేఫ్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.ఇక అసలు విషయానికి వస్తే, అమిత్ – రోల్ రైడా ల వంతు వచ్చినట్లే. అమిత్ ప్లస్ మైనస్ లు ఏమిటో బిగ్ బాస్ చెప్పాలి. అయితే ఈవారం ముందుగా బ్యాగ్ సర్దేసేది రోల్ రైడా అని అంటున్నారు.

ఎందుకంటే ఇంటి సభ్యులు కాకుండా ఇప్పుడు కాపాడాలంటే ఓటింగ్ ప్రధానం. బయట పరిస్థితి చూస్తే రోల్ కి అనుకూల వాతావరణం కనిపించడం లేదని అందుచేత ముందుగా అతడే ఎలిమినేషన్ అవుతాడని విశ్లేషకుల అంచనా. అమిత్ తో పోలిస్తే రోల్ కి మాత్రమే అతి తక్కువ ఓట్లు పోలయ్యాయని తెలుస్తోంది. అందుకే డబుల్ ఎలిమినేషన్ లో మొదటి వేటు పాడేది రోల్ పైనే. ఇక ఆదివారం ఎలిమినేషన్ లో ఎవరు బయటకు వస్తారో అనే అంశం పై సోషల్ మీడియాలో ఎవరికీ వారు ఓటింగ్ కూడా పెడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.