దీప్తి నల్లమోతుపై రెడ్ కార్డు ప్రయోగించడానికి సిద్ధం అవుతున్న బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 2 మరి కొన్ని రోజులలో ముగియనుంది. దీంతో కంటెస్టెంట్స్ మధ్య పోటీ పెరిగిపోయింది. ఇక బిగ్ బాస్ రేటింగ్స్ కూడా వీరలెవెల్లో పోరిగిపోతున్నాయి. ఈవిధంగా టిఆర్పి రేటింగ్స్ దూసుకుపోడానికి కౌశల్ ప్రధాన కారణమని చెప్పవచ్చని అందరూ అనేమాట. ఇక తాజాగా చేసిన సర్వే ప్రకారం 79శాతం మంది కౌశల్ చూస్తున్నారని తేలిందంటే వాస్తవం ఏమిటో తెలుస్తుంది. హౌస్ లో ఒంటరిగా పోరాటం చేస్తున్నా, బయట లక్షలాది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. అతనికి ఫాలోయింగ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రాష్ట్రాలు, దేశాలు దాటి ఖండాంతరాలు చేరింది.

ఇదంతా కౌశల్ పై అభిమానం కాదని,కౌశల్ ఆర్మీ పెయిడ్ టీమ్ అని కొందరు అంటుంటే, గీతా మాధురి,దీప్తి నల్లమోతు అయితే కౌశల్ కి వచ్చే ఓట్లు మొత్తం ఫేక్ అని చర్చించుకున్నారు. అయితే తమది నిజమైన అభిమానం అని ఫాన్స్ నిరూపిస్తూ అభిమానులను అవమానించిన వారికి బుద్దిచెప్పేలా వివిధ కార్యక్రమాలతో తమ బలనిరూపణ చేసుకుంటున్నారు.

తాను బయటకు వచ్చాక కౌశల్ పై ఇన్విస్టిగేట్ చేస్తా అంటూ దీప్తి అనడంపై సీరియస్ గా స్పందించిన కౌశల్ ఆర్మీ అసలు నిజం బయట పెట్టింది . నిజానికి దీప్తి డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటోందని కౌశల్ ఆర్మీ చెప్పుకొస్తోంది.ఇన్నాళ్లూ షో చూస్తున్న ప్రేక్షకుల్ని మోసం చేస్తూ దీప్తి నెట్టుకొచ్చిందని, ఓ ఐటి సంస్థ 5వేలకు పైగా ఎక్కౌంట్స్ క్రియేట్ చేసి ఓట్లు వేయిస్తోందని కౌశల్ ఆర్మీ తన ఇన్విస్టిగేషన్ లో బయట పెట్టింది.

ఇది వైరల్ గా మారడంతో బిగ్ బాస్ టీమ్ దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీప్తి కి వచ్చిన ఓట్లను క్షుణ్ణంగా చెక్ చేయాలని బిగ్ బాస్ బృందం భావిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ ఓట్లు ఫేక్ అని తేలితే, శ్యామల,నూతన్ నాయుడు తరహాలో దీప్తిని కూడా హౌస్ నుంచి బయటకు పంపిస్తారని అంటున్నారు.

ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ లేనందున అందరి కంటే తక్కువ ఓటింగ్ నమోదు అయిన అమిత్ ఎలిమినేట్ అవుతున్నాడు. ఇక దీప్తి ఓట్లు ఫేక్ అని తేలితే తర్వాత వారం బయటకు వెళ్ళేది దీప్తియేనని అంటున్నారు. ఈ ఘటనపై కూడా కొన్ని షోషల్ మీడియా సంస్థలు ఓటింగ్ జరపడం విశేషం.