బిగ్ బాస్ ఆదేశం మేరకు కౌశల్ హౌస్ నుండి బయటకు వచ్చాడు….కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

బిగ్ బాస్ సీజన్ 2 క్లైమాక్స్ లోకి ఎంటరైందని చెప్పుకోవచ్చు. ఫైనల్ వీక్ కు మరో వారం మాత్రమే ఉండడంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. కౌశల్, గీతామాధురి, తనీష్, సామ్రాట్ ల మధ్య గెలుపు దోబూచులాడుతోంది. కౌశల్ పట్ల ఆడియన్స్ లో అభిమానం రెట్టింపవుతోంది. కానీ బిగ్ బాస్ ఇంట్లోనే కౌశల్ కు వ్యతిరేకంగా కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటన్నట్టు గత ఎపిసోడ్లను చూస్తే అర్థమవుతోంది. కౌశల్ ను ప్రత్యేకంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం కనిపిస్తోంది.

హౌస్ లో ఇంకొన్ని రోజులు ఉంటే విన్నర్ ఎవరో తేలిపోతుందన్న నేపథ్యంలో బిగ్ బాస్ ఇంటి నుంచి కౌశల్ ను బయటికి పంపించివేయడం సంచలనం సృష్టిస్తోంది. కౌశల్ మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది… అంటూ బిగ్ బాస్ ఆదేశించగా, కౌశల్ ఎంతో ఆదుర్దాగా వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. అయితే దీనికంతటికి కారణం ఓ అభిమాని అని తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా బిగ్ బాస్ ఇంట్లో కౌశల్ ఎన్ని వ్యతిరేకత పరిస్థితులు ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే.

హౌస్ మేట్లంటే మొదట్నించీ కౌశల్ ను టార్గెట్ చేస్తున్నారు కానీ… నాని ఇప్పటికిప్పుడు టోన్ మార్చేశాడని…. కౌశల్ ను మాత్రమే ఇరకాటంలో పడేసేవిధంగా మాట్లాడుతున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. కౌశల్ కు బ్యాడ్ ఇమేజ్ వచ్చేలా ఉన్న ఈ పరిణామాలతో తీవ్రంగా మనస్తాపం చెందిన ఓ అభిమాని కౌశల్ కోసం నిరహార దీక్షకు పూనుకున్నట్టు ఆలస్యంగా తెలిసింది. హైదరాబాద్ కు చెందిన ఆ యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్కచేయకుండా కౌశల్ కోసం నాలుగు రోజులుగా అన్నపానీయాలు మానేసి దీక్షలో కూర్చున్నాడట.

దాంతో అతని పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి పాలయ్యాడు. కొడుకు పరిస్థితి చూసి అతని తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోయారట. ఆ అభిమాని కౌశల్ కౌశల్ అంటూ నిద్రలో కూడా కలవరిస్తుండడంతో డాక్టర్లు ఇదో ప్రత్యేకమైన కేసు అని గుర్తించారు. ఎంత చికిత్స చేసినా మార్పు రాకపోవడంతో ఇక కౌశల్ వచ్చి ఆ అభిమాని కళ్లెదుట నిలిస్తే తప్ప కోలుకునే అవకాశాల్లేవని చెప్పడంతో అతని తల్లిదండ్రులు భోరున విలపించారు.

డాక్టర్ల సలహా మేరకు వాళ్లు నేరుగా బిగ్ బాస్ 2 జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వెళ్లి నిర్వాహకులతో తమ కొడుకు పరిస్థితి వివరించారు. ఇది ఒకరి జీవితంతో కూడిన సమస్య కావడంతో బిగ్ బాస్ టీమ్ వెంటనే స్పందించి కౌశల్ కు సమాచారం అందించారట. ఓ అభిమాని తనకోసం ఇంత పనిచేశాడా అంటూ ఆందోళన చెందిన కౌశల్ వెంటనే తనను బయటికి పంపించాలని విజ్ఞప్తి చేయగా, బిగ్ బాస్ నిర్వాహకులు అందుకు అంగీకారం తెలిపారట.

ఈ కారణంగానే కౌశల్ ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకుని ఆసుపత్రికి వెళ్లి ఆ అభిమానిని పరామర్శించగా… డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆ కుర్రాడు ఎంతో సంతోషంగా లేచి కూర్చున్నాడు. అనంతరం ఆ అభిమానితో మాట్లాడుతూ… తనకోసం ఇలాంటి పనులు చేయవద్దని, ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పాడట కౌశల్. కాసేపు అక్కడే ఉండి అభిమాని ముఖంలో వెలుగు చూసిన కౌశల్ ప్రత్యేక వాహనంలో తిరిగి బిగ్ బాస్ హౌస్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది.