నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ చేసిన 3 అతి పెద్ద తప్పులు…మీరు గమనించారా?

బుల్లితెర సెన్షేషనల్ షో నడుస్తున్న బిగ్ బాస్ షో మొదలై 100రోజులు పూర్తయిన నేపథ్యంలో జరిగిన ఎపిసోడ్ ఆడియన్స్ కి చికాకు కలిగించింది. ముఖ్యంగా కౌశల్ తన వంద రోజుల బిగ్ బాస్ ప్రయాణాన్ని ఓ టిష్యు పేపర్ పై రాసానని ఏ ముహూర్తాన కౌశల్ అన్నాడో గానీ హౌస్ మెంబర్స్ ఈ 100రూజులు కౌశల్ పై వెళ్లగక్కకుండా మీగిలిపోయిన అసహనాన్ని మాత్రం ఇక్కడ వ్యక్తంచేసేసారు. ఇది చూసిన ఆడియన్స్ ఇంత చెత్త ఎపిసోడ్ మరొకటి లేదని ఆడియన్స్ చాలామంది అనుకున్నారు. ఇక టిష్యు పేపర్ మీద కౌశల్ ఏదో రాసాడని బిగ్ బాస్ నాని సీరియస్ అయ్యాడు. హౌస్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని కౌశల్ పై బిగ్ బాస్ వీరలెవెల్లో ఫైర్ అయ్యాడు.

అంతవరకూ బానే ఉందిగానీ ఇదే ఎపిసోడ్ లో బిగ్ బాస్ మూడు తప్పులు చేసాడని ప్రేక్షకులు అంటున్నారు. వాటిని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. కౌశల్ టిష్యు పేపర్ మీద రాస్తున్నప్పుడు సామ్రాట్, రోల్ రైడా తో మాట్లాడుతూ గతవారం కూడా ఇలాగే ఏదో రాస్తూ ఉన్నాడని అన్నాడు.

మరి చాలామంది టిష్యు పేపర్స్ మీద ఆయా సందర్భాల్లో రాయడం జరిగిందని,ముఖ్యంగా దీప్తి సునయన హౌస్ నుంచి వెళుతూ తనీష్ కి ఓ లెటర్ ఇవ్వడం, దాన్ని తనీష్ చదవడం, అలాగే గతంలో హౌస్ మెంబర్స్ ఇలా పేపర్స్ పై రాయడం జరిగాయి. గతవారం కూడా కౌశల్ ఇలాగే రాసాడు. మరి ఎప్పుడూ సీరియస్ అవ్వని బిగ్ బాస్ కౌశల్ విషయంలో ఎందుకు అంతగా సీరియస్ అవ్వాల్సి వచ్చిందని ఆడియన్స్ నిలదీస్తున్నారు.

ఇక టిష్యు పేపర్ లో ఏదో రాసి,స్టోర్ రూమ్ లో పెడితే ఏమి రాశావంటూ కౌశల్ బిగ్ బాస్ అడిగి స్పష్టంగా తెలుసుకున్నాడు. మరి రోల్ రైడా కు గీతా మాధురి చెవిలో ఏదోచెబితే, ఏమి చెప్పవని మాత్రం బిగ బాస్ ఆమెను అడగలేదు. కౌశల్ ని టిష్యు పేపర్ లో ఏమి రావని అడిగినపుడు గీతాను కూడా ఏమి చెప్పావని ఎందుకు అడగలేదని ఆడియన్స్ బిగ్ బాస్ ని అడుగుతున్నారు.

బిగ్ బామ్ ని పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కౌశల్ హౌస్ లో సక్రమంగా రూల్స్ పాటించడం లేదని బిగ్ బాస్ హోస్ట్ నాని సీరియస్ అయ్యాడు. హౌస్ మేట్స్ హౌస్ నింబంధనలు సక్రమంగా పాటించకపోతే,పరిణామాలు సీరియస్ గా ఉంటాయని నాని తీవ్రంగా హెచ్చరించాడు. ఇంతజరిగినా కూడా అమిత్ ఇచ్చిన బిగ్ బామ్ ని పాటించకుండా రోల్ తన జుట్టును దువ్వుకున్నాడు. మరి అతన్ని ఎందుకు హెచ్చరించలేదని ఆడియన్స్ నిలదీశారు.