ఢీ 11 లో రేష్మి స్థానంలో వస్తున్న బిగ్ బాస్ భామ… ఎవరో చూడండి

బుల్లితెర మీద చాలా రకాల షోలు నడుస్తున్నా డాన్స్ షోకి సంబంధించి సెన్సేషనల్ షో గా డీ షో నిల్చింది. ఒకటా రెండా ఏకంగా 10సీజన్స్ పూర్తిచేసుకున్న డీ ఇప్పుడు 11వ సీజన్ కి సమయాత్తమైంది. డాన్స్ షో అంటే ఇలా ఉండాలని సౌత్ ఇండియాలోనే పేరుగాంచిన షో ఇది. 11వ సీజన్ ప్రోమో ఇటీవల విడుదల కావడంతో అది కూడా సంచలనం అయింది. గత సీజన్స్ తో పోలిస్తే షో లో పెద్దగా మార్పులు జరగలేదని ప్రోమో బట్టి తెలుస్తోంది.

ఇక 11వ సీజన్ కి కూడా న్యాయనిర్ణేతలుగా శేఖర్ మాస్టారు,ప్రియమణి వ్యవహరిస్తున్నారని కూడా ప్రోమో ద్వారా తెలుస్తోంది.
ఇక షో మొత్తానికి ప్రదీప్ కూడా యాంకర్ గా కొనసాగుతున్నాడు. ఇక అరవింద సమేత మూవీలోని డైలాగ్స్ ని ఈ షోకి తగ్గట్టు సుధీర్ మార్చుకుని తనదైన శైలిలో ప్రోమో అదరగొట్టాడు.

“టైటిల్ అనే పదానికి బాడీ మొత్తం ఫిక్స్ అయితే,ఎలా ఉంటుందో తెలుసా ?ఒక అందగాడు 5 అడుగుల దూరంలో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా అంటూ ప్రదీప్ కి డైలాగ్ చెప్పి ఆడియన్స్ ని నవ్వించాడు సుధీర్. తద్వారా ఈ షో ఏ రేంజ్ లో ఉంటుందో, ఏ రేంజ్ లో ఆకట్టుకోబోతున్నాడో చెప్పకనే చెప్పాడని అనవచ్చు.

అయితే అపోజిషన్ టీమ్ కి రేష్మి ని తీసుకోకుండా నిర్వాహకులు అందరికీ షాకిచ్చారు. ఇక రేష్మి కూడా ఎక్కడా కనిపించలేదు. పైగా సుధీర్ డైలాగ్ చెబుతున్న సమయంలో కౌంటర్ గా “ఓ రేయ్ ఓ అందమైన అమ్మాయి ఆవేశంతో వస్తే ఎలా ఉంటుందో తెలుసా’అంటూ ఓ లేడీ వాయిస్ వినిపించింది.

అది ఎవరిదంటే,అనేది నిర్వాహకులు చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. ఆ వాయిస్,బాడీ స్ట్రక్చర్ కూడా రేష్మి వి కావు. ఈ షోలో డీ అంటే డీ అని డీ కొట్టేదెవరో తెలుసా? ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ రెండో సీజన్ లో పార్టిసిపెంట్ గా ఉన్న భాను శ్రీ. భాను శ్రీ కి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక మంచి అవకాశాలు రావటంతో వాటిని భానుశ్రీ బాగా అందిపుచ్చుకుంది.