బిగ్ బాస్ ఎనాలసిస్ కౌశల్ సంచాలకుడిగా ఫెయిల్? మరి మిగతా వాళ్ళు ఏమి చేస్తున్నారు?

రియాల్టీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో పోటీ తారాస్థాయికి చేరి, అన్నీ బూతద్దంలో చూడడం మొదలైంది. ప్రతిచిన్న విషయం నెటిజన్లు గమనిస్తున్నాను. ఇక ఆడియన్స్ కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఇదే సమయంలో టాస్క్ లో సంచాలకునిగా ఫెయిల్ అయ్యాడని హౌస్ మేట్స్ అందరూ కౌశల్ ని బ్లేమ్ చేస్తే, బిగ్ బాస్ యాంకర్ నాని కూడా కౌశల్ సంచలకత్వాన్ని తప్పు బట్టాడు. కౌశల్ ని ఉద్దేశించి డిజాస్టర్ అని అన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు,విశ్లేషణలు జోరుగా హల్ చల్ చేస్తున్నాయి.

శనివారం టాస్క్ లో కలర్ గ్లాస్ లు ప్రతి బజర్ కి ఖాళీ అవ్వాలని, చివరి వరకూ గ్లాస్ ని హోల్డ్ చేసి పట్టుకున్నవాళ్ళే కెప్టెన్ అని బిగ్ బాస్ టాక్స్ లో చెప్పాడు. బిగ్ బాస్ లెటర్ లో కూడా ఉంది. లెటర్ పంపడం వరకే బిగ్ బాస్ పని, ఇక దాన్ని ఆధారంగా ఎవరికి వారు నిజాయితీగా గేమ్ ఆడాలి కదా. మొదటగా అమిత్ గ్లాస్ ని తనీష్ కొట్టాడు.

తనీష్ అడిగినప్పుడు కూడా గేమ్ నీ ఇష్టం అన్నాడే తప్ప , ఇలా పగులగొట్టమని కౌశల్ చెప్పలేదు. రోల్ తన గ్లాస్ ని కిచెన్ లో సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే, సామ్రాట్, గీతా ఇద్దరూ కూడా పగుల గొట్టే యత్నం చేసారు.ఇలా ఒకరి గ్లాస్ ని మరొకరు పగుల గొట్టే ప్రయత్నం ఎవరికి వాళ్లే చేసుకున్నారు. అందుకే చివరి వరకూ రంగు నీళ్లు ఎవరి దగ్గర ఉన్నాయని నాని అడిగితే, ఎవరి దగ్గరా లేవని కౌశల్ చెప్పాడు.

నిజానికి రోల్ తో పాటు,అందరూ వరుసగా బిగ్ బాస్ లెటర్ చదివారు. ఎలా ఆడాలి అనే విషయం కూడా చర్చించుకుని,మ్యాప్ వేసుకున్నారు. అందులో ఎలా వుందో అలా ఆడకుండా భిన్నంగా వ్యవరించారు. శనివారం నాని అదిగినప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు కటింగ్ ఇచ్చారు హౌస్ మేట్స్ . మరి అలాంటప్పుడు సంచాలక్ ఎలా నిందిస్తాం అని ఒకరిద్దరు విశ్లేషకులు సూటిగానే ప్రశ్న సంధిస్తున్నారు.

అసలు నాని టాస్క్ పేపర్ చదవాల్సిన అవసరం కూడా లేదని చెప్పాలి.గతంలో ఒకసారి టాస్క్ లు పరిశీలిస్తే,కారు టాస్క్ లో 24గంటలు కారులో ఉండాలని ఉందేతప్ప కారులో ఒకరినొకరు నెట్టేసుకోమని లేదు. మరి ఎందుకు నెట్టుకున్నారు. హౌస్ మేట్స్ కి గేమ్ లో బాధ్యత లేదా? ఇక కాన్వాస్ పెయిటింగ్ సమయంలో వైట్ బోర్డు మీద కలర్స్ వేసే టాస్క్ లో తనీష్ , దీప్తి నల్లమోతు పోటీపడ్డారు. ఎవరు కలర్ ఎక్కువగా ఉంటే వాళ్ళే కెప్టెన్.

కానీ ఇక్కడ కలర్స్ వేయాలి అనే నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు వాళ్లిద్దరూ కలియబడ్డారు. ఒకరినొకరు తోసేసుకోమని బిగ్ బాస్ చెప్పకపోయినా ఇలా చేస్తే,సంచలకునిగా ఉన్న దీప్తి సునయన ఏం చేసింది పైగా జడ్జిమెంట్ సూపర్ అని పొగిడితే, నాని ఎందుకు అడగలేదు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక సైకిల్ టాస్క్ తీసుకుంటే అసలు సంచాలక్ లేడు.

అంతకు ముందు వారం కెప్టెన్సీ గా ఉన్న దీప్తి నే ఇక్కడ సంచాలక్ గా వ్యవహరించినట్టు లెక్క. ఈ టాస్క్ లో మధ్యలో సైకిల్ పాడైపోతే అది నూతన్ నాయుడు తప్పు కాదు. మరి తనీష్ కోపంతో సైకిల్ దిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఏమిటి? ఇక నూతన్ కి పోటీగా రోల్ చివరివరకూ ఎందుకు సైకిల్ తొక్కాడు.

ఎవరికివాళ్లు ఈవారం గడిస్తే చాలు అనే రీతిలో ఆడారు తప్ప, సీరియస్ గా ఆడలేదు.అని పలువురు విశ్లేషకులు కుండబద్దలు కొట్టారు. అందుకే సంచాలకుల వైఫల్యం అనేకంటే,మొత్తం హౌస్ మేట్స్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఒక్కరినే బాధ్యుణ్ణి చేసి, కార్నర్ చేయడం తగదని మాట సర్వత్రా వినిపిస్తోంది.