సైరా సినిమాపై టెన్షన్ చిరంజీవి ఏమి చేస్తారో ఏమిటో… కొత్త చిక్కులు

రాజకీయాలనుంచి సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే 151చిత్రాన్ని భారీ ఎత్తున చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. స్వాతంత్ర్య సమరంలో కీలకభూమిక పోషించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సైరా చిత్రాన్ని సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జార్జియా దేశంలో జోరుగా సాగుతోంది. భారీ యుద్ధ సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు.

అయితే సైరా మూవీకి సంబంధించి కొన్ని చిక్కులు వచ్చాయట. అదేంటంటే,ప్రస్తుతం చిరు వయస్సు 64ఏళ్ళు. పోరాట యూదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు తగిన వయస్సు. కానీ ఉయ్యాలవాడ యుక్త వయస్సులో చిత్రీకరించాల్సిన సీన్స్ కొన్ని ఉన్నాయట. అందుకే చిరుకి యంగ్ లుక్ తీసుకురావడం కోసం డైరెక్టర్ సురేంద్ర రెడ్డి కసరత్తు చేస్తున్నాడట.

ప్రధమ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ప్రస్తుతం తీస్తున్న పోరాట సన్నివేశాలు బానే వస్తున్నాయి. కానీ యుక్తవయస్సుకి సంబంధించిన సన్నివేశాలు కూడా కథ రీత్యా తీయాల్సి వుంది.ఈ నేపధ్యంలో చిరుకి యంగ్ లుక్ కోసం ప్రముఖ మ్యాకప్ ఆర్టిస్టులను డైరెక్టర్ సురేంద్ర రెడ్డి సంప్రదించి, జోరుగా చర్చలు జరుపుతున్నాడు.

యుక్త వయస్సు లో మీసకట్టు,లుక్ అన్నీ సరిపోయేలా ఊహా చిత్రాలను కూడా గీయిస్తున్నారట. ఆర్టిస్టులు ఊహా చిత్రాలకు తుదిరూపం ఇచ్చాక,చిరంజీవికి యంగ్ లుక్ ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం మీద దృష్టి సరిస్తారట. ప్రస్తుతం జార్జియా దేశంలో పోరాట దృశ్యాల చిత్రీకరణ పూర్తయ్యాక ఇండియా కు వచ్చాక చిరు యంగ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ని ఖరారు చేసి, దసరా పండుగ నాడు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.