ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయో తెలుసా?
మనలో చాలా మంది ప్రతి రోజు పూజ చేస్తూ ఉంటాం. అలాగే దేవాలయానికి కూడా వెళుతూ ఉంటాం. ప్రతి రోజు పూజ చేసే సమయంలో నైవేద్యం పెడుతూ ఉంటాం. నైవేద్యం పెట్టేటప్పుడు కొంతమంది దేవుడికి ఇష్టమైనవి పెడుతూ ఉంటారు. అలాగే కొంతమంది వారికి తోచిన విధంగా నైవేద్యాలను పెడుతూ ఉంటారు. ఆలా కాకుండా ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే ప్రసన్నం అవుతారో తెలుసుకొని ఆ నైవేద్యాలను పెడితే అష్ట ఐశ్వర్యాలు,సిరి సంపదలు కలుగుతాయి. ఇప్పుడు ఆ నైవేధ్యాల గురించి వివరంగా తెలుసుకుందాం.
శివుడు
శివునికి పాలతో తయారుచేసిన పదార్ధాలు,తీపి పదార్ధాలు అంటే ఇష్టం. కొంతమంది పెరుగుతో చేసిన పదార్ధాలను నైవేద్యంగా పెడతారు.
విష్ణువు
మహా విష్ణువుకు పసుపు కాయ ధాన్యాలంటే చాలా ప్రీతి. వీటికి బెల్లం కలిపి చేసిన వంటకాలంటే చాలా ఇష్టం. అందుకే విష్ణువును పూజించేటప్పుడు పసుపు రంగు కలిగిన లడ్డులను నైవేద్యంగా పెడతారు.
శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడుని వెన్న దొంగ అని అంటారు. చిన్నతనంలో శ్రీకృష్ణుడు వెన్నను దొంగతనం చేసి పంచదార కలుపుకొని తినేవారు. వెన్న అంటే అంత ఇష్టం మరి.
వినాయకుడు
వినాయకుడుకి కుడుములు,ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన్ని పూజించేటప్పుడు కుడుములు,ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెడతారు.
ఆంజనేయస్వామి
ఆంజనేయస్వామికి ఎర్రటి ధాన్యాలంటే చాలా ఇష్టం. అందుకే ఎర్రటి కందులను నానబెట్టి బెల్లం కలిపి నైవేద్యం పెడితే కోరిన కోరికలు తీరతాయి.
శనిదేవుడు
శనిదేవునికి నలుపు అంటే ఇష్టం. అందువల్ల నల్లని నువ్వులతో చేసిన వంటకాలు అంటే చాలా ఇష్టం. అలాగే ఆవనూనెతో చేసిన వంటలన్నా ప్రితే.
లక్ష్మి దేవి
అష్ట ఐశ్వర్యాలు,సిరి సంపదలను ఇచ్చే లక్ష్మి దేవికి అన్నం పరమాన్నం అంటే చాలా ప్రీతి.
సరస్వతి
చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో, మంచి బుద్ధి, చదువు ప్రసాదించాలని ఖిచిడీని నైవేద్యంగా పెడతారు.
దుర్గా దేవి
దుర్గాదేవిని పూజించినప్పుడుకిచిడీ లేదా తియ్యటి ఖీర్ ను నైవేద్యంగా పెడతారు.దుర్గాదేవికి ఆ పదార్థాలంటే ఇష్టమట.
కాళికా మాత
ధైర్యం,బలాన్నిచ్చే కాళికామాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు.బియ్యంతో చేసిన తియ్యటి పదార్థాలు, కూరగాయలు,ఖీర్ కాళికా పూజలో ఆ తల్లి ముందు పెడతారు. ఏ వంటకాలైన సరే వరిధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు.