పెళ్లిపీటలు ఎక్కబోతున్న వెంకటేష్ కూతురు… పెళ్ళికొడుకు కోటీశ్వరుడు… ఎవరో చూడండి

సాధారణ ప్రజానీకంలో ప్రేమవివాహాలు ఇంకా పూర్తిస్థాయిలో ఆమోదయోగ్యం కాలేదు కానీ ప్రముఖుల కుటుంబాల్లో మాత్రం సర్వసాధారణం అయ్యాయి. సెలబ్రిటీల పిల్లలకు పార్టీలు ఫంక్షన్లలో ఇతర ప్రముఖుల పిల్లలతో పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లడం గత కొంతకాలంగా కామన్ గా కనిపిస్తోంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, మంచు మనోజ్ తదితరులు ఇలా పెళ్లిళ్లు చేసుకున్నవారే. పెద్దవాళ్లు కూడా వాళ్ల పిల్లల మనసు అర్థం చేసుకుని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే గాకుండా కులం పట్టింపులు లేకుండా గ్రాండ్ గా వివాహ మహోత్సవాలు జరిపిస్తున్నారు. త్వరలోనే ఇండస్ట్రీలో మరో ప్రేమ పెళ్లి జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో టాప్ హీరోగా పేరుగాంచిన విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత వివాహం త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.

అశ్రిత కొంతకాలంగా ప్రేమలో ఉందట. ఆమె కాలేజ్ డేస్ నుంచి ఓ సెలబ్రిటీ కుమారుడితో ప్రేమలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అతడెవరో కాదు హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్. సురేందర్ రెడ్డి మనవడు. సురేందర్ రెడ్డి రేస్ క్లబ్ చైర్మన్ కాకముందే ఆయనకు వందలకోట్ల విలువచేసే వ్యాపారాలున్నాయి. సురేందర్ రెడ్డి గత 30 ఏళ్లుగా రేస్ క్లబ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామి రెడ్డి కూడా వ్యాపారరంగంలోనే ఉన్నారు.

రఘురామిరెడ్డి తనయుడినే అశ్రిత మనసుపడింది. వీళ్ల ప్రేమకు పెద్దవాళ్లు కూడా అంగీకరించడంతో త్వరలోనే దగ్గుబాటి వారి ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయని టాక్ వినిపిస్తోంది. అశ్రిత పెద్ద చదువులు చదువుకుంది. ప్రస్తుతం బేకరీ రంగంలో ఎంటర్ ప్రెన్యూర్ గా ప్రవేశించిన ఈ దగ్గుబాటి వారసురాలు నేషనల్ లెవల్లో బిస్కెట్ల వ్యాపార రంగంలో దూసుకువెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ప్రత్యేకమైన బ్రాండింగ్ తో బిస్కెట్లను రూపొందించి విక్రయాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక కూతురు తన మనసులో మాట చెప్పడంతో విక్టరీ వెంకటేష్ కూడా తన పెద్దరికం నిలుపుకుంటూ సోదరుడు సురేష్ బాబుతో ఈ విషయం చర్చించాడట. ఇంట్లో అందరూ ఈ పెళ్లికి సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలోనే ఎంగేజ్ మెంట్ నిర్వహించి ఆ తర్వాత ఘనంగా పెళ్లి జరిపించాలని ప్లాన్ చేశారట.ఇప్పటికే సురేష్ బాబు సురేందర్ రెడ్డి కుటుంబంతో అశ్రిత పెళ్లి విషయం చర్చించినట్టు తెలుస్తోంది.