ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి,రామ్ చరణ్ భార్య ఉపాసన మధ్య ఈ పోలికలను గమనించారా?

ఎప్పటినుంచో ఒక నానుడు వుంది అదేమిటంటే,అబ్బాయి అల్లరి చేసినా, బలాదూర్ గా తిరుగుతున్నా, తల్లిదండ్రులు చాలా బెంగ పెట్టుకునేవారు. అయితే పెళ్లి చేసాక మారతాడు లెండి అని అందరూ వారికి చెప్పేవారు. అంతెందుకు,మావాడు ఎంత బలాదూర్ గా తిరగలేదు, ఇక మావాడు ఎంత కోపంతో ఉండేవాడు, పెళ్లయ్యాక సైలెంట్ అయిపోయి బుద్ధిమంతుడిగా,పనిమంతుడిగా మారిపోలేదా అంటూ చుట్టాల్లో కొందరు ప్రస్తావించి దైర్యం చెప్పేవారు. ఇదంతా ఎందుకంటే, ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ లో మూవీలో నటించ బోతున్న జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ తేజ్ లు తమకు పెళ్లయ్యాక వచ్చిన మార్పులను చెప్పుకొచ్చారు.

తారక్ విషయానికి వస్తే,ప్రణీతను పెళ్లి చేసుకున్నాక తనలో వచ్చిన మార్పుని వివరించాడు. అంతకుముందు ఆవేశంగా బదులిచ్చి మీడియాను కూడా దూరం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన పద్దతి మార్చుకున్నాడు. తన జీవితంలోకి భార్య గా ప్రణీత వచ్చాక నాలో అనూహ్య మార్పు వచ్చిందని చెబుతున్నాడు.

అలాగే రామ్ చరణ్ విషయానికి వస్తే,ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ తన భార్య ఉపాసనకు కామెడీ సినిమాలంటే ఇష్టమని,అందుకే కామెడీ మూవీస్ వీక్షిస్తూ ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. నిజానికి తనకు బయోపిక్ మూవీస్ అంటే ఇష్టమని,అందులో నిజాలు ఉంటాయని చెర్రీ చెప్పాడు. ఇటీవల సంజు బయోపిక్ చూసినపుడు రణబీర్ కపూర్ నటన అదిరిపోయింది.

కామెడీ మూవీస్ ద్వారా తన భార్య రిలాక్స్ కలిగిస్తోందని చెప్పాడు. అయితే బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే మాత్రం చేయగలనో లేదోనని కూడా చెప్పేసాడు. మొత్తానికి తమ తమ భార్యల వలన తమలో మార్పు వచ్చిందని తారక్,చెర్రీ చెప్పడం, విపరీతంగా వైరల్ అవుతున్నాయి.