మంచువారబ్బాయి మనోజ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు… ఇప్పుడు ఏమి చేస్తున్నాడో?
హీరోల వారసులుగా రంగ ప్రవేశం చేసినా ఆతర్వాత తమ వ్యక్తిగత ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్లే నటుల్లో మంచు మనోజ్ ఒకడని చెప్పవచ్చు. ఆలోచన,ఆవేశం మేళవించిన మనోజ్ తిరుపతిలో తండ్రి నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ స్కూల్ లో చదువుకున్నాడు. చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందుడేవాడట. ఇక యుఎస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. బాలనటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన మనోజ్ 2004లో దొంగ దొంగది మూవీతో హీరోగా వచ్చాడు. హీరో అంటే కేవలం ఇమేజ్ పాత్రలే కాదు,డిఫరెంట్ రోల్స్ చేయాలని తపిస్తూ ఉంటాడు.
శ్రీ,రాజు భాయ్ వంటి రొటీన్ మూవీస్ తో పాటు నేను మీకు తెలుసా,ప్రయాణం,వేదం,ఊ కొడతారా ఉలిక్కి పడతారా వంటి విభిన్న చిత్రాలతో వినూత్న ప్రయోగాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గుంటూరోడు,ఒక్కడు మిగిలాడు చిత్రాల తర్వాత వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల కారణంగా మనోజ్ నుంచి మరో సినిమా రాలేదు.
అయితే ఇతని వ్యక్తిత్వం బాగా తెల్సిన ఫ్రెండ్స్ మాత్రం మనోజ్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుని దూసుకుపోతాడని బలంగా చెబుతున్నారు. నిజానికి నటుడు అవ్వాలనే కోరిక మనోజ్ కి లేదట. డైరెక్టర్ గా ఓ టీమ్ ని రూపొందించుకుని మంచి సినిమాలను తెరకెక్కించాలని కలలు కనేవాడట.
సినిమాల్లో లేకున్నా ట్విట్టర్ ద్వారా సంచలన కామెంట్స్ తో జనం మధ్య ఉంటున్న మనోజ్ కి ఆత్మాభిమానం మెండుగా ఉందని అంటుంటారు. రెస్టారెంట్ లో క్లినర్ గా పనిచేసి,యు ఎస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడని,రాత్రుళ్ళు రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉదయం క్లాసులకు వచ్చేవాడిని, స్వతంత్రంగా జీవించాలని ఎక్కువగా తాపత్రయ పడతాడని అతని ఫ్రెండ్స్ చెబుతుంటారు.
లెజెండరీ ఫామిలీ కి చెందిన వ్యక్తిగా కాకుండా సింపుల్ గా పెరిగి, సింపుల్ గా జీవించడం అతని సుగుణమని ఫ్రెండ్స్ అంటుంటారు.