స్టార్ మా సంచలన నిర్ణయం…విన్నర్ ఎవరో చూడండి

నాని హోస్ట్ గా గడిచిన100రోజులుగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 2 ప్రస్తుతం చివరి అంకంలో ఉంది. కంటెస్టెంట్స్ ఐదుగురు గ్రాండ్ ఫినాలే కి చేరుకోవడంతో ఇక కీలక పరిణామాలకు వేదిక అవుతోంది. ఇన్నాళ్లూ ఒక ఎత్తు అయితే ఈ వారం గేమ్ మరో ఎత్తు. ఇక ఆడియన్స్ ఓటింగ్ కూడా కీలకమే. ఆడియన్స్ ఓట్లు ఆధారంగానే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే బిగ్ బాస్ వన్ తో పోలిస్తే,సీజన్ 2కి ఓటింగ్ భారీగా పెరిగిందట. ఒకిటికి రెండింతలు ఓటింగ్ నమోదవుతోందని అంటున్నారు. ఇక ఆదివారమే గ్రాండ్ ఫినాలే కావడం,ఇక సమయం దగ్గర పడడంతో తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓటు వేసేందుకు ఫాన్స్ పోటీ పడ్తున్నారు.

గ్రాండ్ ఫినాలేకి అర్హత పొందిన కౌశల్,దీప్తి,గీతా మాధురి,తనీష్,సామ్రాట్ ఈ ఐదుగురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఓటింగ్ లో కూడా పోటీ నెలకొంది. అందుకే ఓటింగ్ శాతం విపరీతంగా హెచ్చింది. ఈ ఒక్క వారంలోనే అనూహ్య స్థాయిలో ఓటింగ్ పెరిగిపోయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువ ఓట్లు నమోదవుతాయోనని జోరుగా ఉహాగానాలు సాగుతున్నాయి.

బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చన్న టాగ్ కారణంగా ఎవరికెక్కువ ఓట్లు వచ్చాయో దానికి అనుగుణంగా విజేతను ప్రకటిస్తారా,లేక ముందుగా డిసైడ్ అయిన ప్రకారం విజేతను నిర్ణయిస్తారా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు ఓటింగ్ జెన్యూన్ గా ఉంటుందా ఉండదా అనే దానిపై సామాజిక మాధ్యమాల్లో క్రిటిక్స్, నెటిజన్లు కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

నిజానికి తమిళం తదితర భాషల్లో నడిచే బిగ్ బాస్ షోలలో ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ కి వచ్చే ఓట్లను డిస్ ప్లే బోర్డులపై ప్రదర్శిస్తుంటే,తెలుగులో అలాంటి ఆనవాయితీ లేకుండా పోయింది. అందుకే అనుమానాలు,సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ మా యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది.

గ్రాండ్ ఫినాలే లో ఆడియన్స్ నిర్ణయమే శిరోధార్యంగా ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో స్పష్టంగా ప్రకటించాలని స్టార్ మా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం విజేతను ప్రకటిస్తే, ఎలాంటి ఇబ్బంది ఉండదని, పైగా మునుముందు నిర్ణయించే బిగ్ బాస్ షో లపై మరింత నమ్మకం పెరుగుతుందని స్టార్ మా యాజమాన్యం భావిస్తోందట. లేకుంటే ఇబ్బంది తప్పదని స్టార్ మా గట్టి నిర్ణయానికి వచ్చిందట.