Movies

ఆనందం హిట్..తరువాత ఆకాష్‌ కెరీర్ ఇలా అవ్వటానికి కారణం ఎవరో తెలుసా?

ఒక్కొక్కరికి వద్దన్నా ఛాన్స్ లు వచ్చిపడిపోతుంటాయి. మరికొందరికి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. అది సినీ ఇండస్ట్రీ అయితే మరీను. ఇక అదే రీతిలో మంచి హిట్ సాధించి కూడా కెరీర్ అతని దెబ్బతినేసింది. అతనెవరో కాదు హీరో ఆకాష్. శ్రీలంక తమిళ కుటుంబానికి చెందిన ఆకాష్ అసలు పేరు సతీష్ నాగేశ్వరన్. విచిత్రం ఏమిటంటే ఇతగాడు తెలుగులో చేసిన తొలిమూవీ ‘జూన్ జులై’. సదా హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికీ వెలుగు చూడలేదు. మంచి సాంగ్స్ గల ఈ మూవీని ఎంకే మావుళ్ళయ్య నిర్మించారు. కానీ ఇంతవరకూ విడుదలకు నోచుకోకుండా మూతబడింది. ఇతను లండన్ లో పుట్టి పెరిగాడు. రోజావనం అనే తమిళ మూవీతో తెరంగేట్రం చేసిన ఆకాష్ కి తెలుగులో కూడా మంచి ఎంట్రీ దొరికింది.

ఒకటా రెండా ఏకంగా 18 సినిమాలు బుక్ అయ్యాయి. అన్నీ సెట్స్ మీద ఉన్న హీరోగా ఇండస్ట్రీని షాక్ కి గురిచేశాడు. మంచి ఒడ్డూ పిడుగు గల ఆకాష్ స్టార్ హీరో అవ్వాల్సిన సమయంలో కెరీర్ వెనక్కి పోయింది. తెలుగులో ఆనందం సినిమా ఆకాష్ కి గొప్ప బ్రేక్ ఇచ్చింది. ఆర్ధికంగా కూడా సౌండ్ పార్టీ అయిన ఆకాష్ కి మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనుకున్నారు.

నీతో చెప్పాలని,మనసుతో, తార, పిలిస్తే పలుకుతా, హైటెక్ స్టూడెంట్స్ .ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. ఇక శ్రీను వైట్ల డైరెక్షన్ లో’ఆనంద మానంద మాయే’ మూవీ ఏదో పర్వాలేదనిపించింది. అయితే ఆ తర్వాత హీరోగా ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు. అందాల రాముడు,నవ వసంతం,గోరింటాకు (రాజశేఖర్ మూవీ)సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి,తమిళంలో హీరోగా చేసినా ఫలితం దక్కలేదు. ఇక లాభం లేదని, రామ్ దేవ్ , యుగానికొక్క ప్రేమికుడు,జై గురుదేవ, మిస్టర్ రాజేష్, స్వీట్ హాట్ లాంటి చిత్రాలు తానే హీరోగా నిర్మించాడు.

ఇక స్వీట్ హాట్ మూవీకి ఇతడే డైరెక్షన్ కూడా. నిజానికి ఈ సినిమాలు వచ్చినట్లే జనానికి తెలియదు. ఇక బాగా శరీరం పెరిగిపోయి ఎక్కువ వయస్సు వాడిగా మారిపోయి, మొత్తానికి అన్నీ ఉండికూడా పేడ్ అవుట్ అయ్యాడు. ఆహా ఎంతటి అందం అనే సినిమా తమిళ్, హిందీలలో ఆకాష్ రిలీజ్ చేసాడు. ఇక ఇప్పుడు తమిళంలో తానయన్ అనే మూవీ తీసాడు. ఇది మూడు భాషల్లో తీసి, డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇదంతా సక్సెస్ కోసం ఉవ్విళ్లూరుతున్నందునే అని చెప్పాలి.

మిస్టర్ రాజేష్ మూవీలో ఏకంగా 7పాత్రలు పోషించాడు. ఇక ఓ తమిళ సినిమాలో 5 కేరక్టర్స్ చేసాడు. 37 ఏళ్ళ వయస్సు గల ఆకాష్ విపరీతంగా లిక్కర్ కి అలవాటు పడడం, పనికిమాలిన సబ్జెక్ట్ లతో మూవీస్ తీసి చేతులు కాల్చుకోవడం వంటి వాటితో దెబ్బతిన్నాడు. 1999లో ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ స్టార్ డమ్ నిలబెట్టుకోకుండా మానియాతో పోతున్నాడు.