పుట్టిన రోజున షాకింగ్ న్యూస్ చెప్పనున్న ప్రభాస్…షాకింగ్ న్యూస్ ఏమిటో?

యంగ్ హీరోలలో ప్రభాస్ గల క్రేజ్ వేరు. బాహుబలి లాంటి మూవీలతో తన రేంజ్ ని తారాస్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం చేస్తున్నాడు. ఏడాదికి పైగా సాగే ఈ చిత్రం షూటింగ్ కూడా నత్తనడకనే సాగుతోంది. ఇక ఇతని పెళ్లి గురించి కూడా రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. అనుష్కతో ప్రేమాయణం సాగుతోందని ఆమధ్య విపరీతంగా వార్తలు షికారు చేసాయి. మరోపక్క అనుష్కకి ప్రభాస్ లాంటి భర్త దొరికితే తమకు కావాల్సిందేముందని అనుష్క తల్లి కూడా కామెంట్ చేసింది. అప్పట్లో ఈ ప్రకటనపై ప్రభాస్ ఫాన్స్ చాలా ఆనంద పడ్డారు. కానీ ప్రభాస్,అనుష్క కూడా ఏ విషయం బయటకు చెప్పలేదు.

కాగా ప్రభాస్ పుట్టినరోజు కొద్ది రోజుల్లో రాబోతోంది. అక్టోబర్ 23న 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే ఈసారి తన పుట్టినరోజును గ్రాండ్ గా చేసుకోడానికి ప్లాన్ చేస్తున్నాడట. అభిమానుల సమక్షంలో చేసుకోబోయే ఈ పుట్టినరోజు వేడుకలకు సమ్ థింగ్ స్పెషల్ ఉందట.

మాములుగా అయితే హీరోల పుట్టినరోజులకు టీజర్లు, ట్రైలర్స్ ,కీలక పోస్టర్స్ విడుదల చేయడం చూస్తున్నాం. కానీ వీటికి భిన్నంగా ప్రభాస్ తన పెళ్లి గురించి ఓ కీలక ప్రకటన చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అందరినీ పిలిచి మనసులో మాట ప్రకటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ వేడుకలకు అనుష్క కూడా వస్తోందట. దీంతో అభిమానుల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. పెళ్లి ప్రకటన వస్తుందని, అది నిజంగా ఆశ్చర్యం గొలిపేలా ఉంటుందని ఊహిస్తున్నారు.