హౌస్ లో ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యి ఎంత సందడి చేసారో చూడండి

బిగ్ బాస్ సీజన్ 2 చివరి అంకం లో ఉంది. పీక్ కి చేరిన ఈ సీజన్ మరో మూడు రోజుల్లో విజేత ఎవరో తేల్చేసి మరీ ముగియబోతోంది. అసలు సీజన్ టు 17మంది కంటెస్టెంట్స్ తో మొదలై ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే లో ఐదుగురు మిగిలారు. ఫైనల్స్ కి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మిగిలిన కంటెస్టెంట్స్ గేమ్ లో ఎలాగో ఉంటారు. ఇక ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ కూడా ఈ గ్రాండ్ ఫినాలేకి బిగ్ బాస్ ఆహ్వానించారట. దీంతో హౌస్ లో పండగ వాతావరణం పరచుకుందట. ఎందుకంటే తాజాగా విడుదలైన ప్రోమో ను బట్టి ఈ విషయం స్పష్టం అవుతోంది.

తీన్ మార్ డాన్సులు వేస్తూ వచ్చారు. ఇక తేజస్వి, దీప్తి సునయన లు వచ్చీ రాగానే సామ్రాట్ ,తనీష్ లను హత్తుకుని ఎమోషన్ కి గురయ్యారు. హౌస్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో గుర్తుచేసుకున్నారు. ఎంతోఆనందంగా తేజు తిరుగుతుంటే కింద పడిపోతావు చూసుకో అంటూ రోల్ జోక్ పేల్చాడు. ఇక అమిత్ ని గీతా మాధురి టీ కావాలా అని అడిగితె అమిత్ నేను టీ చేస్తానని అన్నాడు. నా వంట మిస్ అయ్యావా అని

తనీష్ ని తేజు అడగ్గా,నువ్వు వెళ్ళనప్పటి నుంచి నేనే వండుతున్నానని చెప్పుకొచ్చాడు. రోల్,అమిత్ పంచ్ డైలాగులతో అదరగొట్టారు.
వాష్ రూమ్ లోఉన్న గీతాను తేజు పలకరిస్తే,గీతా కూడా విష్ చేసింది. నీవు ఇంకా ఎలిమినేట్ కాలేదా అంటూ తేజుని గీతా అడిగే సరికి అందరు నవ్వేసారు. వాడు మార్పు అంటాడు, నువ్వు రంజు అంటావ్ , ఏంటి మాకు ఈ గోల అంటూ తనీష్ , రోల్ లను ఉద్దేశించి తేజు అనేసరికి హౌస్ నవ్వుల్లో మునిగింది. ఇక నేను చేసింది తప్పు కాదు అంటూ తనీష్ తో తేజు పేర్కొంటూ,హౌస్ లో అందరితో నాకు మంచి రిలేషన్ ఉందని అంది. మొత్తానికి ప్రోమో చూస్తుంటేనే అదిరిపోతోంది. ఇక గ్రాండ్ ఫినాలే ఎలా ఉంటుందో చెప్పతరమా?