అదిరిపోయే కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోతున్న దేవదాస్… ఫుల్ ఖుషీలో నాగ్,నాని

ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై అగ్ర నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించిన దేవదాస్‌ సెప్టెంబర్ 27న రిలీజయింది. నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్‌, రష్మిక, నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించారు. కునాల్‌ కపూర్‌, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ తదితరులు ఈమూవీలో నటించారు. రిలీజ్ రోజున ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ కనిపించింది. రివ్యూలతో పాటు ,జనం ఊహించినట్టే సినిమా కంటెంట్ కూడా ఉండడంతో ఈ మూవీ అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఎందుకంటే క్రిటిక్స్ సైతం ఈ చిత్రం బాగుందని మెచ్చుకోవడం పట్ల ప్రస్తుతం ఫారిన్ లో ఉన్న నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేయడంతో నాని కూడా సంబరాల్లో మునిగిపోయాడు.

కింగ్ నాగార్జున,నాని కల్సి నటించిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్ బాక్సాఫీస్ దగ్గర షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అశ్వినీదత్ మూవీ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బానే జరిగింది. ఇక ప్రతిచోటా ఈ మూవీకోసం బయ్యర్లు పోటీ పడ్డారు. దీంతో దేవదాస్ థియేటర్ హక్కులు తెలుగు రాష్ట్రాల్లో 30కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో రెండు కోట్లు పలికిందని,ఓవర్సీస్ లో ఈ మూవీ రైట్స్ 4న్నర కోట్లకు విక్రయించినట్లు చెబుతున్నారు.

వరల్డ్ వైడ్ ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అమెరికాలో ప్రీ రిలీజ్ పడడంతో ఓవర్సీస్ నుంచి తొలి టాక్ వచ్చింది.
అమెరికాలో 500స్క్రీన్స్ పై విడుదలైన ఈ మూవీ నవ్వుల వర్షం కురిపిస్తోంది. ముందునుంచి భారీ అంచనాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. తొలిరోజు వరల్డ్ వైడ్ గా 13కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో రెండు కోట్ల 75లక్షలు వసూలు చేసింది. ఎపి , తెలంగాణాలలో కల్పి 10కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఇక వరల్డ్ వైడ్ గా 5కోట్ల 44లక్షల షేర్ వసూలు చేసింది. వీకెండ్ నాటికే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుందని అంచనా. ఎక్కడా కూడా నెగెటివ్ రాకపోవడం, వసూళ్ల వర్షం కురుస్తుండడం తో బయ్యర్లు ఆనందంతో మునిగితేలుతున్నారు. మరి ఈ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.