నూతన్ నాయుడు కౌశల్ ఆర్మీ దగ్గరకు వెళ్లి కౌశల్ గురించి ఏమి చెప్పాడో చూడండి

స్టార్ మా టివిలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 మరో మూడు రోజుల్లో ముగియబోతోంది. ఇక గ్రాండ్ ఫినాలేకి ఎంపికైన 5 గురు కంటెస్టెంట్స్ మధ్యా నువ్వానేనా అనే పోటీ నడుస్తోంది. కౌశల్,దీప్తి,గీతా మాధురి,తనీష్,సామ్రాట్ ల మధ్య హౌస్ లో పోరు సాగుతోంది. నిజానికి మొదటి నుంచి కౌశల్ ఒంటరి పోరాటమే చేస్తున్నాడు. అయితే కౌశల్ కి మొదటి నుంచి సపోర్ట్ గా నిలుస్తూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్న వ్యక్తి అంటూ ఉంటె అది నూతన్ నాయుడు మాత్రమే. ఒకసారి హౌస్ లోంచి బయటకు వచ్చి ,రీ ఎంట్రీ ఇచ్చాక కూడా కౌశల్ కి సపోర్ట్ గానే వున్నాడు. అంతేకాదు మళ్ళీ బయటకు వచ్చాక కూడా కౌశల్ కి మద్దతుగానే ఉంటూ వస్తున్నాడు.

కానీ ఈమధ్య కొన్నిరోజులుగా నూతన్ జాడలేదంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో నూతన్ నాయుడు స్పందిస్తూ, అందరితో మాట్లాడాలని అనుకున్నానని, అయితే వ్యక్తిగత పనులుండడం వలన మాట్లాడ్డం కుదరలేదని చెప్పాడు. నేను సైలెంట్ గా ఉన్నానని సోషల్ మీడియాలో ఏదేదో రాస్తూ తనపై ఆరోపణలు చేస్తున్నారని అయితే అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని చెప్పుకొచ్చాడు.

హౌస్ లో ఉండగా ఓట్లు వేసిన వారికి, రీ ఎంట్రీ ద్వారా మళ్ళీ లోపలకు వెళ్ళడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసాడు.
‘హౌస్ లో నా ప్రయాణం ముగిసిందని,అయితే తన మిత్రుడు కౌశల్ గత 110 రోజులుగా కష్టపడుతూ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఇంకా ఒంటరి పోరాటంతో నెట్టుకొస్తున్నాడు.

విజయం అతన్ని వారించాలి’అని నూతన్ పేర్కొన్నాడు. ‘మనం యుద్ధం చివరిలో ఉన్నాం. గెలుపు కోసం ఇన్నాళ్లూ కౌశల్ , కౌశల్ ఆర్మీ ఎలా పనిచేసారో ఇప్పుడు మరింత జాగ్రత్తగా పనిచేయాలి.

విజయానికి అడుగు దూరంలో ఉన్నాం. బిగ్ బాస్ కిరీటాన్ని కైవసం చేసుకోవడం ద్వారా మనందరి కలను కౌశల్ తీర్చబోతున్నాడు. నా మీద చూపే అభిమానాన్ని మిత్రుడు కౌశల్ మీద కూడా చూపించాలి. కౌశల్ ని విన్నర్ గా చేద్దాం’అని వివరించాడు.