అనుష్క ఆస్ట్రియా సడన్ ట్రిప్ వెనుక అసలు కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు చిత్రసీమలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ గతంలో చాలామంది చేసారు. తమ సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం అలాంటి చిత్రాలకు అనుష్క పెట్టింది పేరు. అందం, అభినయం పుష్కలంగా గల అనుష్క డిఫరెంట్ మూవీస్ లో నటిస్తూ సత్తా చాటుతోంది. రొమాన్స్ పండిస్తూ అనేక పాటలు చేసింది ఈ యోగా భామ. ఇక ఈ మధ్య కాలంలో ఈమె వేసినన్ని పాత్రలు ఎవరూ వేసి వుండరు. అరుంధతి, రుద్రమదేవి, పంచాక్షరీ, భాగమతి ఇలా అనుష్క నటనకు అద్దం పట్టిన చిత్రాలు ఎన్నో. డేరింగ్ అండ్ డైనమిక్ గా ఇలాంటి పాత్రలు దొరికిందే తడవుగా ఛాన్స్ అంది పుచ్చుకుని తన అభినయంతో జనం గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇంకా చెప్పాలంటే తన పాత్రల ద్వారా ప్రతి ఇంటికి చేరింది.

అయితే ఆ మధ్య ఓ సినిమా కోసం అనుష్క లావుగా మారింది. సైజ్ జీరో మూవీకోసం బరువు పెరిగి ఓ కల్పనారాయ్ అయింది. అయితే అప్పటినుంచి బరువు తగ్గించుకోవడం ఆమె వలన కాని స్థితి ఏర్పడింది. సహజంగా యోగ నేర్చుకున్న ఈమె కొన్ని ఎక్సయిర్ సైజుల ద్వారా చేసిన ప్రయత్నం వలన కొంత బరువు తగ్గినా ,మునుపటి మాదిరిగా అవ్వలేకపోయింది.

దీంతో ఇండస్ట్రీలో ఈమె కు డిమాండ్ తగ్గిపోవడం,కొత్త తరాలకు వేట మొదలవ్వడం వంటి పరిణామాలను గమనించిన అనుష్క ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్ట్రియా దేశానికి ప్రయాణం అయింది.బాలీవుడ్ తారలు దీపికా పడుకొనే,అలియా భట్, సోనమ్ కపూర్,వంటి వాళ్ళు అప్పుడప్పుడు ఆస్ట్రియాలోని వివామై వెళ్లి వస్తుంటారు. హాలీవుడ్ స్టార్స్ కూడా అక్కడికే వస్తుంటారు. అంతర్జాతీయంగా పేరొందిన బరువు తగ్గించే కేంద్రం అది.

దేహంలో మలినాలను,అనవసర పదార్ధాలను, విషాలను బయటకు పంపించి,అదుపు తప్పిన ఒంటిని మళ్ళీ స్వాధీనంలోకి తెస్తుంది. ఖర్చు కూడా ఎక్కువే మరి. అయితే స్టార్స్ కి ,సెలబ్రిటీలకు ఆ ఖర్చు ఓలెక్క కాదు. అంతే కాదు మనల్ని రోగులుగా కాకుండా గెస్ట్ ల ట్రీట్ చేస్తారు.
నిజంగా అదో ప్రపంచం. అక్కడి డాక్టర్లకు మన ఒంటిని పూర్తిగా అప్పగించేయాలి. మన అలవాట్లు,దేహ లక్షణాలను అవగతం చేసుకుని వైద్య చికిత్స ప్రారంభిస్తారు.

అక్కడ వైఫై ఉండదు. ఫోన్,టివి,ట్విట్టర్,ఫేస్ బుక్ ఇలా ఏవీ అందుబాటులో వుండవు. చదవడానికి పుస్తకాలు మాత్రం ఉంటాయి. కడుపు పెద్ద పేగు, చిన్న పేగు ఖాళీ చేసేస్తారు. నఖ శిఖ పర్యంతం పరిశీలించి అవసరమైన మసాజ్ లు, యోగా,పవర్ యోగా, జిమ్ , సైక్లింగ్ వంటివన్నీ స్టార్ట్ చేయిస్తారు. స్టీమ్ బాత్, మడ్ బాత్, బ్రీత్ ఎక్సర్ సైజులు వంటివి చేయిస్తారు. టీ,కాఫీ, ఆల్కహాల్ వంటివి అస్సలు దరిచేరనీయకూడదు.

రోజుకి కేవలం 600క్యాలరీల ఆహరం మాత్రమే తీసుకోవాలి. అంటే రోజువారీ తిండిలో ఇది మూడవ వంతు మాత్రమే. పైగా ఆమ్ల స్వభావ పదార్ధాలు వదిలిపెట్టేసి, క్షార స్వభావ పదార్ధాలు మాత్రమే స్వీకరించాలి. టిఫిన్ మహరాజులా హెవీ గా, ఓమోస్తరుగా లంచ్, రాత్రి బిచ్చగాడులా అతికొద్ది ఆహరం ఇలా రూల్స్ ప్రకారం లాగించాలి. మరి నిజంగా ఇక్కడికే అనుష్క వెళ్లిందా లేదా, మరో పనిమీద వెళ్లిందా అన్నది చూడాలి.