బిగ్ బాస్ 2 కౌశల్ Vs దీప్తి విజేత ఎవరు?

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా 100రోజులు దాటిపోయి ఇక తుది సమరం జరుగుతోంది. ఇప్పటివరకూ ఒక రకమైన హడావిడి హౌస్ లో ఉంటె, ఇక ఇప్పుడు మరో రకమైన సందడి నెలకొంది. హోస్ లో కౌశల్,తనీష్, గీతా మాధురి,దీప్తి,సామ్రాట్ లు గ్రాండ్ ఫినాలే లో టైటిల్ కోసం తహతహలాడుతున్నారు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ అందరిలో టెన్షన్ రాజ్యమేలుతోంది. ఆఖరికి చేరడంతో రాత్రి 9 న్నర అయ్యేసరికి టీవీలకు అతుక్కుపోయి బిగ్ బాస్ వీక్షించే జనం ఇక ఈవారంలో అయిపోతోందని ఒకింత విచారం వ్యక్త్యంచేస్తూనే ఆఖరి రోజుల్లో గేమ్ ని మరింత ఆతృతగా చూస్తున్నారు.

ఇక హౌస్ లో అందరూ కల్సి కౌశల్ ని టార్గెట్ చేస్తూ,అరుస్తూ ఇబ్బంది పెట్టినా సరే ఏమాత్రం చలించకుండా వస్తున్నాడు. అందుకే ఫైనల్స్ కి చేరుకోగలిగాడు కౌశల్. ఇక కౌశల్ గ్రాండ్ ఫినాలేకి చేరడంలో ఆయన అభిమానులు కౌశల్ ఆర్మీ కీలక భూమిక వహించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కౌశల్ ని టార్గెట్ చేయడం,దాదాపు 10 సార్లు ఎలిమినేషన్ లో ఉండడం వంటి పరిణామాలను సైతం అధిగమించడానికి కౌశల్ ఆర్మీ ఎంతో దోహదం చేసింది. కౌశల్ ఎక్కువ సార్లు ఎలిమినేషన్ లో ఉన్నా సరే, ఓటింగ్ లో టాప్ ప్లేస్ కి చేరుతూనే ఉన్నాడు.

అదేవిధంగా దీప్తి నల్లమోతు కూడా 7సార్లు నామినేషన్స్ లో ఉన్నా,జనం ఆమెను కూడా సేఫ్ జోన్ లో ఉండేలా చేస్తూ వచ్చారు. నిజానికి హౌస్ లోకి వచ్చిన రోజుల్లో భయపడుతూ, ప్రతి విషయానికి టెన్షన్ పడుతూ ఉండేది. అయితే రానురాను తన గేమ్ ని రసవత్తరంగా కొనసాగిస్తూ టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా చేరింది.

ఇంకా చెప్పాలంటే ఒక దశలో కౌశల్ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించుకుంది. ఇప్పుడు ఫైనల్స్ లో ఓటింగ్ లో ఏమాత్రం తేడా కొట్టినా కంటెస్టెంట్స్ సీన్ రివర్స్ అయిపోతుందని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఓటింగ్ మొదలయ్యాక కౌశల్ ఆర్మీ సత్తా చూపిస్తూ,ముందు వరుసలోనే కొనసాగాడు. అయితే దీప్తి అనూహ్యంగా ఓట్ల వర్షంతో దూసుకొచ్చి,కౌశల్ కన్నా ముందంజలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కౌశల్ వెర్సస్ దీప్తి అన్నట్లు గా వాతావరణం మారిపోయింది. మరి విజయం ఎవరిని వరిస్తుందో!