రాజమౌళి భార్య,శ్రీను వైట్ల భార్య,చిరు కూతురు… ఈ ముగ్గురు ఒకే రంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటో తెలుసా?

తమ తల్లిదండ్రుల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరో హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు ఎక్కువే. బాలీవుడ్ లో హీరోయిన్స్ వారసత్వంగా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే ఇటీవల తెలుగులో కూడా హీరోల కూతుళ్లు హీరోయిన్స్ గా ఆకట్టుకుంటున్నారు. ఇక కొందరైతే కాస్ట్యూమ్స్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. అలా వచ్చినవాళ్లలో మెగాస్టార్ తనయ సుష్మిత ఒకరు. ఇప్పటికే బిగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి వైఫ్ రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ రంగంలో దూసుకుపోతున్నారు. మగధీర, బాహుబలి వంటి మూవీస్ లో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ లో ఆమె ప్రతిభ అద్వితీయం.

ఇక శ్రీను వైట్ల భార్య రూప వైట్ల కూడా మంచి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పేరుతెచ్చుకున్నారు. కాగా మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత కూడా ఈ రంగంలో అడుగుపెట్టింది. రాజు తలచుకుంటే ఏదైనా అయిపోతుంది అన్నట్లు మెగాస్టార్ కూతురు కావడంతో ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఇలా వారసులకు అవకాశాలు ఇస్తుపోవడం వలన మిగతా వాళ్లకు ఛాన్స్ లు రాకుండా పోతున్నాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

ఖైదీ నెంబర్ 150 లో కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన సుష్మిత ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా మూవీకి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేస్తూ మరోవైపు డివివి దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీకి కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేస్తోంది.

దానయ్య నిర్మాతగా రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం షూటింగ్ స్పాట్ కి ఇటీవల చిరంజీవి వెళ్లిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఓ వైపు చిరంజీవి, మరోవైపు రామ్ నుంచుని సుష్మితతో దిగిన ఫోటో తాజాగా విడుదల చేయడంతో ఈ పిక్ ఇప్పుడు మెగా అభిమానులకు పండగ వాతావరణంగా మారింది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్,టైటిల్ ని విజయదశమి కానుకగా విడుదల చేసి, సంక్రాంతికి మూవీ విడుదల చేస్తారని టాక్. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి వుంది.