అక్కినేని పేర్ల వెనుక ‘నాగ’ రహస్యాన్ని చెప్పిన నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ సుశీల, నాగచైతన్య.. వీరి అందరి పేర్ల ముందు ‘నాగ’ ఉండటం మనం గమనించాం. అయితే ఆలా పెట్టటానికి గల కారణం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? అది వాళ్ళ ఆచారమా? దీని గురించి నాగార్జున ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ప్రతి రోజు నాగుపాము కలలోకి వచ్చేదట. అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టిన కొన్ని రోజులకు వాళ్ళ అమ్మగారు పాలు పట్టిస్తూ ఉండగా పాము పిల్ల కనిపించదట. దాంతో వాళ్ళ అమ్మగారు నాగేశ్వరరావు అని పేరు పెట్టారు. 
Nagarjuna Sonsఆ తర్వాత అది అక్కినేని నాగేశ్వరరావు గారు వారి పిల్లలకు నాగ కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు. చైతన్య కు కూడా నాగ కలపమని నాగార్జున వాళ్ళ అమ్మగారు ప్రత్యేకంగా చెప్పారట. అందుకే చైతన్య కాస్త నాగ చైతన్య అయ్యాడు. ప్రస్తుతం నాగార్జున తన కొడుకు అఖిల్ రెండో సినిమా ‘హలో’ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అఖిల్ మొదటి సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోవటంతో రెండో సినిమా ఏమైనా హిట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు నాగార్జున. మనం కూడా అఖిల్ ‘హలో’ సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుందాం. Akhil And Nagarjuna