బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చేది నాగ్ కాదు ఎన్టీఆర్ కాదు….మరి ఎవరో తెలుసా?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత ఎవరోరేపు సాయంత్రం ప్రత్యేక ఎపిసోడ్‌లో తెలిసిపోతుంది. మొదటి నుండి కూడా కౌశల్‌ విజేత అంటూ బలమైన టాక్‌ వినిపిస్తుంది. కౌశల్‌ ఆర్మీ ఏ స్థాయిలో బయట ప్రభావం చూపుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌశల్ కి రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరుగుతున్నట్టు ప్రచారం సాగుతుంది. కౌశల్ ని విజేతగా ప్రకటిస్తారని కౌశల్ ఆర్మీ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. మరో వైపు ఇతర పార్టిసిపెంట్స్ కూడా తమే విజేత అని గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇక బిగ్‌బాస్‌ వారాంతం ఎపిసోడ్‌ను ఒక రోజు ముందే ప్లాన్‌ చేస్తారనే విషయం తెల్సిందే. అంటే ముందు రోజు చిత్రీకరించి, ఆ తర్వాత రోజు ప్రసారం చేస్తారు. ఇక రేపటి ఎపిసోడ్‌ను నేడు చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌కు నాగార్జున, ఎన్టీఆర్‌లలో ఒకరు వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది.

నాగార్జున ఇటీవలే ‘దేవదాస్‌’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హాజరు అయిన విషయం తెల్సిందే. అందుకే ఫైనల్‌ ఎపిసోడ్‌కు ఆయన వచ్చే ఛాన్స్‌ లేదు.నాగార్జున తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు ఎన్టీఆర్‌. మొదటి సీజన్‌ హోస్ట్‌ అయిన ఎన్టీఆర్‌ ఈ షో ఫైనల్‌ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

కాని తాజాగా మరో పేరు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌లో కనిపించబోతున్నాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వెంకీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లుగా కొందరు చెబుతుండగా, మరి కొందరు మాత్రం బిగ్‌ బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ కోసం వెంకీ హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.